మెగాస్టార్ చిరంజీవి సినీ కేరళలోనే  భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబడిన చిత్రం సైరా నరసింహారెడ్డి. అంతేకాకుండా చిరంజీవి తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడు పోషించని స్వతంత్ర సమరయోధుడి పాత్రలో ఈ సినిమాలో నటించారు. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న విడుదలైంది. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో  చిరంజీవి నటనకే  కాకుండా ఇతర ముఖ్య పాత్రల్లో చేసిన నటులకు కూడా ఎన్నో ప్రశంసలు దక్కాయి. కాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు ఇప్పటికే నెల రోజులు కావస్తోంది. అక్టోబర్ 2 న విడుదలైన ఈ చిత్రం బిసినెస్ చాలా చోట్ల ముగింపు దశకు వచ్చేసింది. 



 అయితే సైరా నరసింహారెడ్డి విడుదల ఈ నెల రోజులు గడిచి పోవడంతో ప్రస్తుతం ముగింపు  కలెక్షన్స్ విడుదలయ్యాయి. అయితే సైరా నరసింహారెడ్డి సినిమాను అమ్మిన రేటు ప్రకారం చూస్తే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ దాటలేదు సైరా నరసింహారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల మార్క్ షేర్ ను అందుకున్న సైరా నరసింహారెడ్డి మిగతా ప్రాంతాల్లో మాత్రం అంతలా వసూళ్ళలో  ప్రభావం చూపలేదు. అయితే తెలంగాణలో పెరిగిన దసరా సెలవుల నేపథ్యంలో నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడింది. మొత్తంగా 240 కోట్ల గ్రాస్... 143 కోట్ల రూపాయల షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది సైరా.  అయితే ఈ చిత్రాన్ని 188 కోట్లకు పైగానే నిర్మాతలు అమ్మినట్లు సమాచారం. అయితే చిరంజీవి సైరా తెలుగులో మాత్రమే మంచి వసూళ్లు సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్ల షేర్లను తీసుకొచ్చింది సైరా. 



 ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటలేదు సైరా  నరసింహారెడ్డి. నైజాం ఉత్తరాంధ్ర లాంటి ఒకటి రెండు చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది  తప్ప మిగతా చోట్ల నష్టాలే వచ్చాయి . ఇక మిగతా భాషల్లో అయితే సైరా నరసింహారెడ్డి తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్సీస్లో అయితే 2.5 మిలియన్ల దగ్గరే ఆగిపోయింది సైరా నరసింహారెడ్డి. హిందీలో సైరా సినిమా రిలీజ్ అయిన రోజు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వార్ సినిమా కూడా విడుదల కావడంతో... వార్  సినిమా ముందు సైరా సినిమా నిలబడ లేక పోయింది. దీంతో వసూళ్ళ పరంగా హిందీలోనూ తీవ్ర నిరాశ పరిచింది సైరా నరసింహారెడ్డి. అయితే చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా  తెరకెక్కిన సైరా నరసింహారెడ్డితో  చిరంజీవికి నటన పరంగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కమర్షియల్ గా  మాత్రం అందరినీ నిరాశపరిచింది అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: