టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు  టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో  తెలుగు చిత్రపరిశ్రమలోనే విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. అంచనాలను మించిన విజయంతో  అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కి గొప్ప స్టార్ డమ్  తెచ్చిపెట్టింది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మొదటి సినిమా పెళ్లి చూపులు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ కి బాటలు వేసిన చెప్పాలి. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించింది. మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది . విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని సెన్సేషనల్ స్టార్ గా  ఎదిగిన విజయ్ దేవరకొండ కూడా హీరోగా పరిచయం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. 



 ఈ నేపథ్యంలోనే కింగ్ ఆఫ్ హిల్  అనే సొంత బ్యానర్ స్థాపించాడు విజయ్ దేవరకొండ. తన బ్యానర్ లోనే దర్శకుడు  తరుణ్ భాస్కర్ హీరోగా  ఓ సినిమా నిర్మించాడు. అయితే విజయ్ దేవరకొండ నిర్మించిన తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన చిత్రం మీకు మాత్రమే చెప్తా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది... అంతేకాకుండా  ఈ సినిమాకి మంచి స్పందన కూడా వస్తోంది. థియేటర్లో కామెడీ అదిరిపోయిందంటు ... సినిమాకు  వెళ్లిన వారు పడి పడి నవ్వుకుంటతున్నారంటూ  టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ అద్భుతంగా కామెడీని పంచాడంటూ  ప్రశంసలు కూడా అందుకున్నారు. 



 తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ సూపర్ గా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా విజయం కోసం విజయ్ దేవరకొండ బాగానే  కష్టపడ్డాడు . ప్రమోషన్స్ లో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ కనిపించాడు. కాగా నేడు ఈ సినిమా విడుదల సందర్బంగా  ఓ థియేటర్లో టికెట్లు కూడా అమ్మాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు తాజాగా మీకు మాత్రమే చెబుతా  అనే చిత్రం నుంచి ఓ సీన్ కూడా అభిమానులతో పంచుకున్నాడు విజయ్ దేవరకొండ. మీకు మాత్రమే చెప్తా సినిమాలోని ఓ కామెడీ సీన్ కు జనాలు కడుపుబ్బా నవ్విస్తున్న వీడియో ని షేర్ చేశాడు టాలీవుడ్ రౌడీ . థియేటర్లో ప్రేక్షకులు లాఫింగ్ మ్యాడ్ నెస్ తో ఉగిపోతున్నారని మీరు కూడా వెళ్లి  హాయిగా నవ్వుకోండి అంటూ అభిమానులకు సూచించారు. తన సినిమాను చూసే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నందుకు  హ్యాపీగా ఉందంటూ తెలిపాడు విజయ్ .


మరింత సమాచారం తెలుసుకోండి: