వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో మంచి సినిమాలు తీస్తాడ‌ని పేరున్న రవిబాబు కొద్ది రోజులుగా వ‌రుసగా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నాడు. ర‌విబాబు అంటేనే చిన్న చిన్న క‌థ‌ల‌ను కూడా చాలా ఎంగేజింగ్‌గా చెప్తాడ‌న్న పేరు ఉంది. అయితే తాజాగా ఆవిరి టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే ఆస‌క్తి రేప‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. అయితే సినిమా చూస్తే ఆ అంచానాలు అన్ని త‌ల్ల‌కిందులు అయ్యాయి. కథలో దమ్ము లేకపోవడం వలన ఒక ఫాల్స్ కథ చెప్తూ అసలైన కథ క్లైమాక్స్ లో చెప్పాలనుకున్నాడు.


అయితే ఈ క‌థ చాలా సార్లు ఇప్ప‌టికే చెప్పేయ‌డంతో ప్రేక్ష‌కులు క‌థ‌తో క‌నెక్ట్ అవ్వ‌లేదు. కథ హార్రర్ పరంగానూ, ఎమోషనల్ పరంగా కనెక్ట్ అవ్వదు. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే డైరెక్టర్ గా రవిబాబు కంప్లీట్ గా ఫెయిల్ అయిన సినిమా ‘ఆవిరి’. ఇక సీనియ‌ర్ రైట‌ర్ సత్యానంద్ రాసిన స్క్రీన్ ప్లే కూడా సినిమాకు ఏ మాత్రం హెల్ఫ్ అవ్వ‌లేదు. అస‌లు స‌గ‌టు సినిమా అభిమాని కూడా ఊహించే సిల్లీ స్క్రీన్ ప్లే రాయ‌డం ఏంటో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.


ఇక అవును సీరిస్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసేలా హ‌ర్ర‌ర్ సినిమాలు చేసిన ర‌విబాబు ఈ సినిమాతో ప్రేక్ష‌కుల నుంచి ఇంత చెత్త సినిమా తీశాడేంట్రా అని షాక్ అయ్యేంత చెత్త‌గా ఆవిరి సినిమా ఉంది. ఓ హ‌ర్ర‌ర్ సినిమా ట్యాగ్ లైన్ వేసుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ప్పుడు కనీసం కొన్ని చోట్లయినా భయపెట్టి ఆడియన్స్ ని థ్రిల్ చేయలేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. మొదటి వీకెండ్ లోనే కనపడకుండా ఆవిరైపోయే ఈ సినిమా ర‌విబాబు ఆఖ‌రు ఆశ‌ల‌ను ఆవిరి చేసేసింది. ఇక దిల్ రాజు కూడా ఇలాంటి సినిమాలు మోస్తే ఆయ‌న ప్ర‌తిష్ట కూడా మ‌స‌క బారుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: