దేవీశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చిన రెండు దశాబ్దాల్లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ముఖ్యంగా గత ఏడేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ చాయిస్ గా మారాడు. అప్పటి వరకూ నెంబర్ వన్ గా ఉన్న మణిశర్మ కొంత స్లో అవడం.. దేవీ సూపర్ హిట్స్ ఇవ్వడంతో నెంబర్ గేమ్ లో టాప్ కు చేరుకున్నాడు. కానీ.. దేవీకి ఈమధ్య అంతగా కలిసి రావడం లేదు.

 


ఇటివల దేవీ ఇచ్చే ఏ ట్యూన్స్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. రోటీన్ కొట్టుడు అనే పేరు తెచ్చుకున్నాడు. పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే ఈ సినిమాకు దేవీ మ్యూజిక్ అంటే.. “దేవీనా..” అని సాగదీసే పరిస్థితికి వచ్చేసింది. ముఖ్యంగా మహేశ్ తన సినిమాలకు రెగ్యులర్ గా దేవీనే తీసుకుంటున్నాడు. భరత్ అనే నేను, మహర్షి సినిమాల పాటలు వింటే ఏ సినిమాలోనివో అర్ధం చేసుకోవడానికి టైమ్ పడుతుంది కూడా. సరిలేరు.. సినిమాకు కూడా మహేశ్ మరోసారి దేవీనే తీసుకున్నాడు. ఈసారైనా మంచి సాంగ్స్ ఇవ్వాలన్న మహేశ్ అభిమానుల డిమాండ్ కు ‘చాలెంజ్ యాక్సెప్టడ్’ అంటూ హామీ ఇచ్చే పరిస్థితికి వచ్చేశాడు. కానీ.. టైటిల్ ట్యూన్ వింటే మళ్లీ కథ మొదటికొచ్చినట్టే ఉంది. ఏమాత్రం ఆకట్టుకోని రెగ్యులర్ ట్యూన్ అది. దర్శకుడు అనిల్ కు, దేవీకి దీనిపై చిన్న మనస్పర్ధ కూడా వచ్చిందని ఆమధ్య వార్తలు షికారు చేశాయి.

 


మరో పక్క సుక్కు — బన్నీ సినిమాకు కూడా దేవీనే సంగీతం. కారణం సుకుమారే. తాను సినిమా చేస్తే దేవీనే ఉండాలని ఎప్పుడూ చెప్తూంటాడు. బన్నీ కూడా బలవంతంగానే దేవీని ఓకే చేశాడని టాక్. రంగస్థలం తర్వాత ఆ స్థాయి సంగీతం ఇవ్వని దేవీ.. మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తాడో లేదో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: