మెగా హీరో  వరుణ్ తేజ్ , ట్యాలెంటెడ్  డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం  గద్దలకొండ గణేష్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం  పాజిటివ్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.   ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం  25 కోట్ల షేర్ రాబట్టగా  తెలుగు రాష్ట్రాల్లో  22కోట్ల షేర్ తో   బ్రేక్ఈవెన్ కాగా  ఓవర్సీస్ లో మాత్రం నిరాశపరిచింది.  ఇక ఈచిత్రం  అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 4న విడుదలకానుందని సమాచారం.  



కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'జిగర్తండా' కు రీమేక్ గా రూపొందిన  ఈచిత్రంలో  బాబీ సింహ పాత్రలో  వరుణ్ తేజ్,  సిద్దార్థ్ పాత్రలో తమిళ  యువ హీరో అథర్వ మురళి నటించగా  వీరికి  జోడిగా   పూజాహెగ్డే , మృణాళిని రవి నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన  ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్  బ్యానర్ పై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మించారు.   ఇక  ఈచిత్రంతో ఈఏడాది  వరుణ్  తేజ్ బ్యాక్ టు బ్యాక్  విజయాలను అందుకున్నాడు. ఇంతకుముందు   ఈ సంక్రాంతి కి  మల్టీ స్టారర్ మూవీ ఎఫ్2 తో వచ్చి  వరుణ్  తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.



 వరుణ్ తేజ్ ప్రస్తుతం  బాక్సర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.  కాగా హరీష్ శంకర్  స్క్రిప్ట్ పూర్తి చేసుకొనే పనిలో వున్నాడు.  mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో  హరీష్  తన  తదుపరి చిత్రాన్ని  చేయనున్నాడు.  త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: