కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా, యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి, గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. కోలార్ గనుల నేపద్యంలో అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించబడిన ఈ సినిమాను కన్నడంతో పాటు భారత దేశంలోని పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాక ప్రతి భాషలోనూ అత్యద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అందరూ విపరేతంగా ఆదరించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ భారీ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింధి. భారీ స్థాయి విజువల్ ఎఫ్ఫెక్ట్స్, అదిరిపోయే యాక్షన్ మరియు ఫైట్ సీన్స్, సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కళ్ళు చెదిరిపోయే సెట్టింగులు వెరసి కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశాయి. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సెక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా

అంతకు మించిన భారీ ఖర్చు మరియు తారాగణంతో నిర్మితం అవుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో కొన్ని క్షణాలు కనిపించి, చాప్టర్ 2 లో కీలక పాత్రగా మారనున్న ఆధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా, పలువురు ఇతర బాలీవుడ్ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సినిమా షూటింగ్ కు కొంత అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత మళ్ళీ షూటింగ్ ని మొదలెట్టిన టీంకు మద్యలో మళ్ళీ కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని సమాచారం. ఆ విధంగా మళ్ళీ కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని, ఇలావరుసగా రెండు సార్లు జరుగడంతో, అప్పటికే సినిమా కోసం డేట్స్ ఇచ్చిన కొందరు నటీనటులకు సమస్యలు తలెత్తయాని, ప్రస్తుతం వారి కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడంతో మళ్ళీ సినిమా వాయిధా పడే అవకాశం గట్టిగా ఉన్నట్లు చెప్తున్నారు. 

దీనిని బట్టి, రాబోయే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా, మరింత ఆలస్యం అయి, ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సమాచారం. దానితో కేజీఎఫ్ యూనిట్ కూడా కొంత ఆలోచనలో పడ్డట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తపై ఆ సినిమా యూనిట్ నుండి మాత్రం అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంధి. మరి ఇధే కనుక నిజం అయితే, ఇధి ఒకరకంగా దేశవ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ సినిమా లవర్స్ కి నిజంగా గుండె బద్దలయ్యే వార్తే అని చెప్పక తప్పదు. మరి ఈ సినిమా విషయామై రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: