టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ప్రస్తుతం తాను స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయి ఉన్నారు. ఇక గత ఏడాది టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి అనే భారీ డిజాస్టర్ మూవీలో నటించిన పవన్, ఆ తరువాత సినిమాలకు పూర్తిగా సెలవు ప్రకటించి, పూర్తి స్థాయిలో రాజకీయాలకు అంకితం అయ్యారు. అంతేకాక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తరపున భీమవరం మరియు గాజువాక ప్రాంతాల్లో పవన్ పోటీ చేయడం జరిగింధి. అయితే అనూహ్యంగా ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా పరాజయం పాలయ్యారు. ఇక అక్కడినుండి మరింతగా పార్టీ కార్యాలకలపై దృష్టిపెట్టి, పార్టీని ప్రజలకు మరింతగా చేరువ చేసేలా ప్రణాళికలు రచిస్తున్న పవన్, అతి త్వరలో ప్రజల వద్దకు యాత్రల ద్వారా చేరువయ్యేందుకు సిద్దం అవుతున్నారు. 


ఇకపోతే మరొకవైపు ఆయన ఫ్యాన్స్ మాత్రం, పవన్ గారు తమకోసం ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో ఆయన్ను ఒత్తిడి చేయడం జరుగుతోంది. అయితే మొదట్లో ఆ విషయమై ససేమిరా అన్న పవన్ గారు, అభిమానుల కోసం ఎట్టకేలకు ఒక సినిమా చేయడానికి సిద్దమయ్యారు. గమ్యం అనే సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయి, ఆ తరువాత కంచె, కృష్ణం వందే జగద్గురుం, గౌతమి పుత్ర శాతకర్ణి, అలానే ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు తీసిన క్రిష్ జాగర్లమూడి, పవన్ నటించబోయే 26వ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


మంచి సామాజిక నేపద్యం ఉన్న కథతో, అన్ని రకాల కమర్షియల్ హంగులు కలగలిపి క్రిష్ ఈ సినిమాను తీస్తున్నట్లు టాక్ వినపడుతోంధి. అయితే పవన్ సన్నిహితుల ద్వారా ఈ సినిమా విషయం బయటకు వచ్చినప్పటికీ, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేధు. అయితే నేడు కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా విషయమై పవన్ గారే అప్పుడే న్యూస్ బయటపెట్టోద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం క్రిష్, ఆ సినిమాకు పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నారట. మరొక పదిహేను రోజుల్లో ఆ పని పూర్తి అవుతుందని, కావున అప్పుడే సినిమా విషయామై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయవచ్చని ఆయన చెప్పారట. అందుకే ఈ విషయాన్ని ఇప్పటివరకు మీడియాకు చెప్పకుండా రహస్యంగా ఉంచినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే పవన్ ఫ్యాన్స్ కు పండుగ కాలం మొదలైనట్లే అని చెప్పక తప్పదు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: