తమిళ యాక్షన్ స్టార్ కార్తీ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హిట్ మూవీ ఖైదీ. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తన సహజసిద్ధమైన ఆకట్టుకునే నటనతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా కార్తీ మంచి విజయంను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం సూపర్బ్ గా కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది ఖైదీ సినిమా. సామ్ సి ఎస్ అందించిన నేపధ్య సంగీతం, ఆకట్టుకునే విజువల్స్, అలరించే యాక్షన్ మరియు ఫైటింగ్ సీన్స్, ప్రేక్షకుడిని కట్టి పడేసే విధంగా సాగిన కథ మరియు కథనాలు వెరసి ఈ ఖైదీ సినిమాకు సూపర్ హిట్  టాక్ ని అందించడం జరిగింది. 

ఇక ఈ సినిమా పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించబడడం, అలానే హీరోయిన్ మరియు పాటలు లేకపోవడం వంటి వినూత్న అంశాలు సినిమాకు హిట్ కు మరింత దోహదం అందించేలా చేశాయని అంటున్నారు విశ్లేషకులు. దాదాపుగా పదేళ్ళపాటు జైలు జీవితం గడిపిన ఒక ఖైదీ, అనంతరం జైలు నుండి విడుదలైన తరువాత తన కూతరుని కలుసుకునేందుకు బయల్దేరే సమయంలో అనుకోకుండా జరిగిన ఒక ఘటన ద్వారా ఒక సమస్యను ఎదుర్కొని ఏ విధంగా సమస్యలను ఎదిరించి బయటపడి, చివరకు తన కూతురిని చేరుకున్నాడు అనే పాయింట్ ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అనే చెప్పాలి. 

ఇకపోతే ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని దాటేసిన ఈ సినిమా, రేపటి నుండి బయ్యర్లను పూర్తిగా లాభాల్లో ముంచేయనుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కేవలం మన తెలుగులోనే కాదు, అటు తమిళనాడు లో కూడా ఈ సినిమాగా బాగా కలెక్ట్ చేస్తోందని చెప్తున్నారు. అయితే అదే రోజున విజయ్ హీరోగా తెరకెక్కిన బిగిల్ సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా ఏ మాత్రం దాని ప్రభావం ఖైదీ మీద పడలేదని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో కొనుగోలు చేసిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ ఆనందానికి అవధులు లేవని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెంత మేర కొల్లగొడుతుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: