రాం గోపాల్ వర్మ! బహుశా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అతను నోరు తెరిచినా వివాదమే. ట్వీటు వేసినా సంచలనమే. ఎప్పు ఏద ఒక కాంట్రవర్సీని క్రియేట్ తన చుట్టూ తిప్పుకోవడం రాంగోపాల్ వర్మ కు అలవాటే. రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలని తహతహలాడుతుంటాడు. ఇప్పుడు కొత్తగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ ఒక సెన్సేషనల్ మూవీకి తెరలేపి ట్రైలర్ ను కూడా వదిలాడు.

ఇది కూడా కాస్తా ఇప్పుడు అటు సినీ వర్గాల్లోనే కాకుండా  రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇలా మూవీస్ ని కాంట్రవర్సీల చుట్టూ తిప్పడం ఒక్క ఆర్.జి.వి కే సాధ్యం. ఆఖరికి కాంట్రవర్సీలతోనే ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఇలాగే మొన్న ఆ మధ్య పోర్నోగ్రఫీ కి సంబంధించి ఒక లఘు చిత్రాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇది కాంట్రవర్సీ గా మారడమే కాకుండా తనకు చాలా ఇబ్బందులనే తెచ్చిపెట్టింది. స్వయంగా కొన్ని టీవీ షోస్ లో ఈ లఘు చిత్రం విషయమై మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారనే కూడా కేసు వర్మ పై ఉంది. 

ఆ కేసులే ఇప్పుడు రాంగోపాల్ వర్మను జైలు దాకా లాక్కెళ్లే పరిస్థితిని తెచ్చిపెట్టాయి .ఇదే కాకుండా అతనిపై చాలా కేసులు చాన్నాళ్లుగా మూలుగుతూ వస్తున్నాయి. అవి అన్నీ ఎప్పుడు ఒక్కసారిగా అతనిపై వచ్చి మీద పడతాయో చెప్పలేము. ప్రస్తుతం మహిళా మండలికి సంబంధించిన వ్యక్తులు పెట్టిన కేసులకు సంబంధించి రాంగోపాల్ వర్మను విచారణకు పిలిచారు
ఇలా సదరు మహిళలపై దుర్భాషలాడిన రాంగోపాల్ వర్మను పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారట. విచారణ లో కథ కనుక అడ్డం తిరిగితే  రాంగోపాల్ వర్మ జైలుకు వెళ్లడం ఖాయమని వినికిడి. సినిమాల కోసం కాంట్రవర్సీలకు పోయి రాంగోపాల్ వర్మ తన కెరీర్ కే చెక్ పెట్టుకునేలా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: