దర్శకుడు రవిబాబు తన మొదటి సినిమా అల్లరి నుంచి విభిన్నసినిమాలే తెరకెక్కిస్తూ వస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాపవుతున్నాయి. తన ప్రతి సినిమాకు దాదాపుగా సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ప్రయాణిస్తు వస్తున్న రవిబాబు తన తాజా సినిమా 'ఆవిరి' కి మాత్రం దిల్ రాజు కాంపౌండ్ లోకి వచ్చి పడ్డాడు. దీంతో వరుసగా ఫ్లాప్ సినిమాలు తీస్తున్న రవిబాబు ని సురేష్ బాబు పక్కన పెట్టడం వల్లే దిల్ రాజు దగ్గరకి వచ్చి చేరినట్ట్లు ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. అయితే  రాజుగారితో అసోసియేట్ అయితే తన సినిమాకు భారీగా ప్లస్ అవుతుందనుకుంటే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది.

'ఆవిరి' సినిమా నవంబర్ 1 న.. ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ఎక్కడా కూడా హడావుడి కనిపించడం లేదు. అంతేకాదు చాలామందికి అసలు ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా తెలియదు.  ఈరోజు 'ఆవిరి' సినిమా రిలీజ్ కదా అంటే.. 'అవునా?' అంటూ ఆశ్చర్యపోతున్నారు. దిల్ రాజు బ్యానర్ తో టై అప్ అయితే సినిమాకు పబ్లిసిటీ విపరీతంగా వస్తుందనుకుంటే అది జరగకపోగా సినిమాకు అసలు ఏమాత్రం క్రేజ్ రాకుండా పోయింది. ఈ మధ్య దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో యూనిట్ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇలా కనీసం జనాలకు కూడా ఒక సినిమా వస్తుందన్న సంగతి తెలీడం లేదు.  కొద్దిరోజుల క్రితం రాజుగారు ప్రెజెంట్ చేసిన మరో చిన్న సినిమాకు ఇదే పరిస్థితి నెలకొంది.

గతంలో రవిబాబు సినిమాలు ఎలా ఉన్నప్పటికి ప్రమోషన్ లో మాత్రం పీక్స్ అని చెప్పాలి. వెరైటీ ఐడియాలజీతో దర్శకుడు రవిబాబు చేసే ప్రమోషన్ వల్ల కనీసం ఓపెనింగ్ కలెక్షన్లు అయినా బావుండేవి. కానీ ఈ సినిమాకు అది కూడా జరగలేదు. దీంతో రాజుగారి బ్యానర్లో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేస్తారు అనే సిద్దాంతం మారిపోయింది. ఏదేమైనా ఇలా జరగడం రాజుగారి బ్రాండ్ ఇమేజ్ ను మరింత దెబ్బకొట్టేలా ఉంది. అంతేకాదు ఆయా దర్శకులకు ఇంకో సినిమా ఛాన్స్ రావాలంటే ఇక మీదట కష్టం అని కూడా అర్థమవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: