టాలీవుడ్ లో ఈ మధ్య భారీ బడ్జెట్ తో వచ్చిన సైరా. ఈ సినిమాకి అయిన బడ్జెట్ 270-300 కోట్లని చెప్పారు. అయితే తీరా సినిమా చూశాక అంత బడ్జెట్ ఎక్కడైంది. అన్న అనుమానాలు అందరిలోను వచ్చాయి. ఆ తర్వాత నిర్మాత రాం చరణ్ బడ్జెట్ కంట్రోల్ చేయలేకపోయాడని తను నమ్మిన వాళ్ళు బాగా మోసం చేశారని టాక్. అందుకే కొణిదెల ప్రొడక్షన్ లో కొన్ని మార్పులు కూడా చేసారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ కంట్రోల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ కాస్ట్ కంట్రోల్ అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అదుపు తప్పి పెట్టే పెట్టుబడి వల్ల లాభం ఉండదు. హీరో మార్కెట్ .. సినిమా స్పాన్ ని బట్టి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బడ్జెట్ అదుపు తప్పితే ఆ ప్రభావం ఎంతమంది మీద ఉంటుందో ఇంతకముందు మన దర్శక, నిర్మాతలు అనుభవించారు.

యంగ్ హీరో నితిన్ కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సెట్స్ మీదుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తొంది. ఇక ఇంతకముందు నితిన్ చేతికి గాయం అవ్వడంతో కొన్ని నెలల పాటు షూటింగ్ ఆలస్యమైంది. అతను కోలుకున్న తర్వాత మళ్ళీ రీసెంట్‌గా షూటింగ్ ని రీస్టార్ట్ చేశారు. కారణం ఏదైనా ఈ ఆలస్యం నితిన్ టీమ్ ని బాగా టెన్షన్ పెడుతున్నట్లు అనిపిస్తోంది.

ఇప్పటికే ఫిబ్రవరి 3వ వారంలో సినిమాని రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. అందుకే సాధ్యమైనంతవరకు షూటింగ్ పూర్తి చేయాలని వెంకీ కుడుముల ఈ సినిమాని చాలా స్పీడ్ గా తెరకెక్కిస్తున్నాడట. ఇటీవల తూ.గో జిల్లా అన్నవరం పరిసరాల్లో షెడ్యూల్ ని పూర్తి చేశారు. అయితే అక్కడ చాలా సీన్లు కట్ షాట్ తరహాలో చిత్రీకరించారని సమాచారం. అయితే ఇలా ఎందుకు చేశారు? బడ్జెట్ పెరిగిపోతోందనే భయంతోనే ఇలా చేశారా? కంట్రోల్ నియమం పాటిస్తున్నారా?  లేక ఆ కట్ షాట్స్ వెనక అసలు సీక్రెట్ ఏమిటి? అన్న ఆరా తీస్తున్నారు. ఇక భీష్మ తన కెరీర్ లో ఎంతో కీలకమైన సినిమా అని నితిన్ అంటున్నాడట. మళ్ళీ ఈ సినిమాతో సక్సస్ జర్నీ స్టార్ట్ అవుతుందని ధీమాగా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: