విజయ్ సేతుపతి కోలీవుడ్ లో పెద్ద హీరో. అంతేకాదు విలక్షణమైన నటుడు కూడా. ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగలడు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ నే మించిపోయాడు. హీరో ఇమేజ్ లో ఇరుక్కోకుండా సినిమాలు చేస్తోన్న ఏకైక నటుడు. సాధారణంగా స్టార్ హీరోగా గుర్తింపు వచ్చిన తర్వాత ఏ నటుడు ఆ స్థాయికి దిగి క్యారెక్టర్లు చేయరు. కానీ విజయ్ సేతుపతి హీరో ఇమేజ్ ని-  ఆర్టిస్ట్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్నాడు. సేతుపతి మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలడనే నమ్మకం దర్శకుల్లో బలంగా అనిపించేలా చేశాడు. 

అంతేకాదు టాలీవుడ్ దర్శకులు కూడా విజయ్ ని వదలడం లేదు. అతని ట్యాలెంట్ ని గుర్తించి ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తున్నారు. ఇటీవలే సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే తమిళ యోధుడిగా.. ఉయ్యాలవాడ అనుచరుడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. దాంతో విజయ్ కి సైరా నటుడిగా మరింత గుర్తింపు ను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ విజయ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. తాజాగా సుకుమార్-బన్నీ సినిమాలో కూడా విజయ్ సేతుపతిని విలన్ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు తాజా సమాచారం. 

అయితే ఈ సినిమాకు విజయ్ రెమ్యూనరేషన్ భారీగానే అందుకోబోతున్నాడట. 40 రోజుల షెడ్యూల్ కు గాను దాదాపు 6 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. విజయ్ డిమాండ్ ని నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. విజయ్ ఇమేజ్ ని పక్కన బెట్టి పాత్రలను ప్రేమించే నటుడు కాబట్టే చిన్న-పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలను కమిట్ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న విలన్లలోనే హయ్యెస్ట్ పెయిడ్ విలన్ గా పాపులరవుతున్నాడు. తమిళంలో హీరోగా తెలుగులో విలన్ గా అతడు డ్యూయల్ గేమ్ ఇంట్రెస్టింగ్.



మరింత సమాచారం తెలుసుకోండి: