మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాస్ మరియు కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ గద్దలకొండ గణేష్, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఎక్కువగా లవర్ బాయ్ గా కొన్ని సినిమాల్లో నటించిన వరుణ్, ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ అనే ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. ఆకట్టుకునే కథ మరియు కథనాలతో తెరెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆకట్టుకునే సహజ నటనతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ మాస్, 

మరియు ఎంటర్టైనింగ్ ఎలెమెంట్స్ మరియు హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ కూడా తోడవడంతో సినిమా మంచి హిట్ సాధించింది అనే చెప్పాలి. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో వచ్చిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి ఆచంట తమ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. మొదట్లో ఈ సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టగా, కొందరు టైటిల్ విషయమై కొద్దిపాటి వివాదాన్ని రేపడం, అది కోర్ట్ వరకు చేరడంతో, చివరకు కోర్ట్ సినిమా టైటిల్ మార్చమని తీర్పు ఇవ్వడంతో, రిలీజ్ కు ముందు రోజు ఈ సినిమాకు గద్దలకొండ గణేష్ గా టైటిల్ మార్పు చేసారు. ఇంత వివాదం మధ్య కూడా ఈ సినిమా సక్సెస్ అవడం గొప్ప విషయం అనే చెప్పాలి. 

ఇక యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన ఈ సినిమాలోని పాటలు అన్ని కూడా ఎంతో సక్సెస్ అవ్వగా, ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం శోభన్ బాబు గారు మరియు శ్రీదేవి గారు కలిసి నటించిన దేవత సినిమాలోని 'వెల్లువొచ్చి గోదారమ్మ' రీమిక్స్ సాంగ్ మాత్రం ఫ్యాన్స్ ని థియేటర్స్ లో ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. ఇక నేడు దీని ఫుల్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ప్రస్తుతం ఈ సాంగ్ అద్భుతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సాంగ్ పై ఒక లుక్ వేయండి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: