మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి తర్వాత 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటు ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడ ఎరుగని కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండే మెగాస్టార్- శివ కాంబో పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా త్రిష తో పాటు చాలా మంది హీరోయిన్స్ ను అనుకున్నారు.. అయితే అఫీషియల్ గా మాత్రం ఇప్పటివరకు హీరోయిన్ ఎవరని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇదే సమయంలో ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం తెలుగమ్మాయి ఈషా రెబ్బాను ఎంపిక చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈమధ్య  కాలంలో ఈషాకు మంచి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. నటిగా నిరూపించుకోవడంతో పాటు గ్లామర్ పరంగా కూడా హాట్ హీరోయిన్స్ కి పోటీగా అందాల ఆరబోతకు రెడీ అంటోంది. 

ఇక చిరు 152 లో ఒక ముఖ్యమైన పాత్రకు ఈషాను తీసుకునే ఆలోచనలో మెగా కాంపౌడ్ ఉందని కొరటాల శివ కూడా ఆమెకు ఓకే చెప్పినట్లుగా తాజా సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఈషాతో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత సెకండ్ హీరోయిన్ పాత్ర ఈషా చేయబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట.

ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది ఉగాదికి మెగా 152 సినిమాని విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా పుకార్లు మీడియాలో వచ్చాయి. వాటికే ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఈషా ఈ సినిమాలో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈషా నిజంగా చిరు సినిమాలో ఉందా లేదా అన్నది తను అయినా చెప్తే బావుంటుందని కొందరు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: