2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్.. వరుసగా స్టార్ అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న కాజల్ దాదాపు తెలుగులో ఉన్న అందరితో నటించి మెప్పించింది. కెరియర్ అయిపోయింది అనుకున్న ప్రతిసారి క్రేజీ ఛాన్సులు అందుకుంటున్న కాజల్ కు పెళ్లి వైపు గాలి మళ్లినట్టు తెలుస్తుంది.


అంతేనా ఓ బిజినెస్ మ్యాన్ తో ఆల్రెడీ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. కాజల్ కూడా త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది రానున్న ఇండియన్ 2 సినిమా తర్వాత కాజల్ పెళ్లి చేసుకుంటుందని కోలీవుడ్ మీడియా వర్గాల టాక్. ఇంతకీ కాజల్ మనసు దోచిన ఆ బిజినెస్ మ్యాన్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.


12 ఏళ్లుగా ఒక్క టాలీవుడ్ లోనే కాదు సౌత్ భాషల్లో సత్తా చాటుతున్న కాజల్ అడపాదడపా హిందిలో కూడా తన టాలెంట్ చూపించింది. అయితే హిందిలో ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేదు. తెలుగు, తమిళంలో మాత్రం కాజల్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. తెలుగులో ఖైది నంబర్ 150 సినిమాలో చిరుతో కలిసి నటించిన కాజల్ మళ్లీ ఫాం లోకి వచ్చింది.


ప్రస్తుతం టాలీవుడ్ ముద్దుగుమ్మలంతా పెళ్లి బాట పడుతున్నారు. ఇప్పటికే పెళ్లి తర్వాత సమంత స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. మాములుగా అయితే పెళ్లి తర్వాత సినిమాలు తగ్గుతాయి కాని సమంత విషయంలో అది రివర్స్ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా సమంత వరుస సినిమాల్లో నటిస్తుంది. మరి సమంతలా కాజల్ కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సో నెక్స్ట్ ఇయర్ కాజల్ పెళ్లి కన్ ఫాం అని తెలుస్తుంది. ఇది ఓ రకంగా ఆమె ఫ్యాన్స్ కు చేదు వార్త అని చెప్పొచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: