తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 షో  రేపటితో పూర్తవుతుంది.  ఈ నేపథ్యంలో ఇంట్లో మొన్నటి వరకు శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలి రెజా, రాహుల్ కొనసాగుతున్నారు.  ఎన్నో టాస్క్ లు, గేమ్స్ గెల్చి వారు ఫైనల్ వరకు చేరుకున్న విషయం తెలిసిందే.  ఈ వారం ఇంట్లోకి యాంకర్ సుమ ఎంట్రీ  ఇచ్చి తెగ సందడి చేసింది. అందరి తో చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఆడించి సందడి చేసింది. 


అయితే ఈ వారం ఇంటి సభ్యులకు తమ జర్నీ చూపించి కన్నీరు పెట్టించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.  మొత్తానికి బిగ్ బాస్ 3 తో ఉన్న అనుబంధం రేపటితో ముగియబోతుంది.  చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈసారి బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరా అని ఎదురు చూస్తున్నారు. ఈ  నేపథ్యంలో నిన్న బిగ్ బాస్ లోకి  ఎలిమినేట్ అయిన సభ్యులు అందరూ వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా తమన్నా కాస్త హాట్ హాట్ డ్రెస్ వేసుకు రావడం హైలెట్ గా నిలిచింది.  బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టి షాక్ ఇచ్చింది. 


ఆమె ఎంటర్ అయిన తరువాత శ్రీముఖి.. హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ వద్దమ్మా.. నీకో నమస్కారం అంటూ పంచ్ వేసింది. పునర్నవి, వితిక రావడంతో రాహూల్, వరుణ్ సందేశ్ కళ్లలో ఆనందం చెప్పలేం.  పునర్నవి రాగానే శ్రీముఖి ఆమె ఎత్తుకొని తిప్పేసి.. రాహుల్ దగ్గరకి తీసుకుకెళ్లింది. వితికా వచ్చిన వెంటనే తన భర్త వరుణ్ ని హత్తుకొని అలానే ఉండిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బాబా భాస్కర్, జాఫర్ ల కామెడీ హైలైట్ గా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: