లక్ష్మీ కళ్యాణం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసి సౌత్ ఇండస్ట్రీ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తర్వాత వెంటనే వరుసగా సౌత్ లో విజయాలు రావటంతో సౌత్ ఇండస్ట్రీ కాదని బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదమని భావించి అక్కడ సినిమాలు ఒప్పుకొని...సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చిన అవకాశాలని వదులుకుని చేతులు కాల్చుకుంది కాజల్ అగర్వాల్. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒప్పుకున్న సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ వైపు తిరిగి చూసి వరుస ఆఫర్లు దక్కించుకుంది.


అయితే కాజల్ అగర్వాల్ వయస్సు ప్రస్తుతం 34 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఆమె పెళ్లి విషయమై రకరకాల వార్తలు ఇటీవల బయటకు వస్తున్నాయి. ఇదే క్రమంలో కాజల్ వివాహంపై ఆమె ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇటీవల కాజల్ అగర్వాల్ మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో తన పెళ్లి గురించి ప్రస్తావించింది. తాను త్వరలోనే వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కాజల్ తెలిపింది. తనకు కాబోయే భర్త చిత్ర పరిశ్రమకు చెందినవాడు మాత్రం కాదని తెలిపింది. అదేవిధంగా తన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా కాజల్ వివరించింది.


తనకు కాబోయే భర్త తెలివైనవాడు, దైవ భక్తి కలవాడు అయి ఉండాలి అని తెలిపింది. తాజాగా సోషల్ మీడియాలో  కాజల్ అగర్వాల్ కు కాబోయే భర్త గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఆమె చేసుకోబోయే వరుడు బిజినెస్ మేన్ అని తల్లిదండ్రులు చేస్తున్న వివాహమని వచ్చే ఏడాదే కాజల్ అగర్వాల్ పెళ్లి కాబోతున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా మాత్రం కాజల్ గాని ఆమె తల్లిదండ్రులు కానీ ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కాజల్ అగర్వాల్ స్పందించాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: