టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యువ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మి కళ్యాణం' అనే సినిమాతో ఎంటరై, ఆ తరువాత కృష్ణవంశీ 'చందమామ' అలానే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు రాజమౌళిల కాంబినేషన్లో వచ్చిన 'మగధీర' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఇక అక్కడినుండి పలువురు టాలీవుడ్ మరియు కోలీవుడ్ అగ్ర నటుల సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన కాజాల్ అగర్వాల్, ఇటీవల నాచురల్ స్టార్ నాని నిర్మించిన అ అనే సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం రానా సరసన నేనే రాజు నేనే మంత్రి అలానే యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సీత సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించిన కాజల్

ప్రస్తుతం శంకర్ మరియు కమల్ హాసన్ ల ప్రతిష్టాత్మక మూవీ భారతీయుడు 2లో హీరోయిన్ గా నటిస్తోంది. కొన్నాళ్ల క్రితం తన సోదరి నిషా అగర్వాల్ వివాహము అయి, ఆమెకు బిడ్డ పుట్టడం, ఆ బిడ్డతో కాజల్ ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇటీవల ఫోటోలకు ఫోజులివ్వడం చూసాము. అయితే కొద్దిరోజులుగా కాజల్ కూడా పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు కూడా పలు మీడియా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె అతి త్వరలో పెళ్లికూతురు కాబోతున్నట్లు టాక్. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో కాజల్ మాట్లాడుతూ, 

తన జీవితాన్ని పంచుకునే సరైన వ్యక్తి కోసం తాను ఎదురు చూస్తున్నాన్నానని చెప్పడం జరిగింది. అయితే అది మాత్రమే కాక ఆమె కొద్దిరోజలుగా ఒక యువ వ్యాపారవేత్తతో డేటింగ్ లో ఉన్నారని, కానీ ఆ విషయాలు మాత్రం కాజల్ తన ఇంటర్వ్యూ లో బయటపెట్టలేదని అంటున్నారు. సో, దీనిని బట్టి మరికొద్దిరోజుల్లో ఆ వ్యాపారవేత్తతో కాజల్ పెళ్లి అవడం చాలా వరకు ఖాయం అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. అంతేకాక వారి పెళ్లి పై రెండు కుటుంబాల పెద్దలు కూడా సుముఖంగా ఉన్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం, వెలువడాల్సి ఉంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: