వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ. ఈయన ఒక మంచి ఎంటర్‌టైనరనే చెప్పాలి నిజంగా. ఆయన తీసే దాంట్లో కంటెంట్, కాంట్రోవర్సీ రెండూ సరి సమానంగా ఉంటాయి. నిజానికి ప్రేక్షకులకు కావాల్సింది కూడా ఇలాంటివి కాబట్టి, ఆయన ఇలాంటి సినిమాలనే ఎక్కువగా  ఎంచుకుంటున్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారం రేపిన వర్మ ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో మళ్లీ రచ్చ చేయబోతున్నారు వర్మ.


ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ను కూడా విడుదల చేసిన వర్మ ఇప్పుడు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన పాటను తన దైన శైలిలో విడుదల చేశారు. ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకి హడల్.. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ ఫన్నీ లిరిక్స్‌‌ తో ఈ పాటను కంపోజ్ చేశారు వర్మ టీం సభ్యులు. లోక్ సభ ఎన్నికల సమయంలో పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు మరి. ఎన్నికలంటే అందరు రాజకీయ నాయకులు ఎంతో సీరియస్‌గా ఓట్ల కోసం పని చేస్తారు, కానీ పాల్ మాత్రం తన కామెడీ యాంగిల్‌తో జనాలతో పాటు ఇతర రాజకీయవేత్తలను కూడా రాష్ట్రంలో బాగా నవ్వించారు.


ఆ సమయంలో పాల్ చేసిన ఫన్నీ వీడియోలు, కామెంట్లు, సెలబ్రిటీలతో ఆయన దిగిన ఫొటోలను వీడియోలో చూపించారు మనందరికి. ‘మనదంతా ఇంటర్నేషనల్ థింకింగ్. చిన్న చిన్న వాళ్లైన జగన్, చంద్రబాబు, కేసీఆర్ పవన్ కళ్యాణ్ కాదు మోదీ మన టార్గెట్ అని చెప్పారు. 2024 లో ఆ సీట్ మనదే. మన ప్రమాణ స్వీకారానికి ఒకరు ఇద్దరు కాదు 150 దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు తమ ఫ్యామిలీతో కలిసి వస్తారు’ అని పాల్ చెప్పిన మాటలను వీడియోలో వ్యంగంగా చూపించారు.


ఈ వీడియోను విడుదల చేసిన గంటలోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చేసాయి. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో పాల్‌ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. ఈ పాటను సిరా శ్రీ రచించారు. అజయ్ మైసూర్ ఈ సినిమాకు నిర్మాతగా చేస్తున్నారు. డిసెంబర్ 22 వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ వీడియో గురించి ఎన్ని మాటలు చెప్పినా నిజంగా తక్కువే. కావాలంటే మీరు కూడా చూడండి యూట్యూబ్ లో, పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం 100 %.


మరింత సమాచారం తెలుసుకోండి: