రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఎన్నో వివాదాలని మూటగట్టుకుంటుంది. సినిమా ప్రకటించినప్పటి నుండి టైటిల్ పై పెద్ద చర్చే జరుగుతుంది. టైటిల్ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ కులమ్ మీద పాట కూడా రిలీజ్ చేశాడు. ఆ పాట మీద ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలుసు. ఒకానొక టీవీ డిబేట్ లో పెద్ద చర్చ జరిగి గీత రచయితకి, వర్మగారికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.


ఆ గొడవ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. వర్మ తన సినిమాలు ఎంత కాంట్రవర్సీగా ఉంటాయో ఆయన చేసే ట్వీట్లు కూడా అంతే వివాదాస్పదంగా ఉంటాయి. ఆ గీత రచయితని టార్గెట్ చేస్తూ వర్మ చాలానే ట్వీట్లు చేశాడు. అయితే ఆ గీత రచయిత కూడా వర్మని బాగానే ఏసుకున్నాడు. పప్పు వర్మ అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అయితే ప్రస్తుతం వర్మ తన వివాదస్పద సినిమా ప్రమోషన్లలోకి రాజమౌళిని లాగాలని ప్రయత్నించాడు.


వర్మ, తన సినిమాలోని కే ఏ పాల్ మీద పాటని రిలీజ్ చేశాడు. ఈ పాట మొదట్లో జేమ్స్ బాండ్ తరహాలో ఎంట్రీ ఇచ్చి మిగతా పార్ట్ అంతా పాల్ గారి రాజకీయ ఫోటోలని చూపుతూ పాటని కట్ చేశాడు. ఈ పాట మీద ట్వీట్ చేస్తూ..‘ఇండియాలో జోకర్ మూవీ అంత పెద్ద విజయం సాధించినప్పుడు, కేఏ పాల్ బయోపిక్ బాహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుంది. 


రాజమౌళి వాషింగ్టన్ లోకూడా పాల్ తో దీని గురించి చర్చించారట, పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారు’ అని ట్వీట్ చేసి అందులో రాజమౌళిని ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన రాజమౌళి  “ఇందులో నన్ను ఇన్వాల్వు చెయ్యొద్దు ‘రాజు’ గారు” అని ట్వీట్ చేశారు. మీ గొడవల్లోకి, వివాదాలలోకి నన్ను లాగొద్దు అంటూనే, రాజు గారు అని సంభోధించడం వల్ల ఈ కులాల గొడవల్లోకి నన్ను లాగవద్దని చెప్పి చెప్పనట్టుగా చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: