ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుధీర్ బాబు హీరోగా నిలబడేందుకు తన ప్రయత్నాలు చేస్తున్నాడు. యువ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకునేందుకు ఎప్పుడు కష్టపడుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు నానితో కలిసి 'వి' సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.  


నాని, సుధీర్ ఎవరికి వారు ఈ సినిమాలో సత్తా చాటేలా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుధీర్ ఏ సినిమా చేస్తున్నాడు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే లేటెస్ట్ గా సుధీర్ బాబు తన పిక్ తో అందరికి షాక్ ఇచ్చాడు. కండలు తిరిగే దేహంతో తన విశ్వరూపం చూపిస్తున్నాడు సుధీర్ బాబు.


ఒక్కసారిగా ఆర్నాల్డ్ ను చూసినట్టే ఉందని ఘట్టమనేని ఫ్యాన్స్ కామెంట్స్ లో పెడుతున్నారు. వర్క్ అవుట్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవని సుధీర్ బాబు ఈమధ్య ఓ వెహికల్ ను నెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను ఈ ఫోటో పెట్టి మాటలు క్యాప్షన్ లో కాదు.. యాక్షన్ లో చూపించాలి అంటూ కామెంట్ కూడా పెట్టాడు సుధీర్ బాబు.


కరెక్ట్ సినిమా పడాలే కాని సుధీర్ కూడా స్టార్ హీరో అయ్యే కటౌట్ ఉంది. కాని అలాంటి సినిమాలే తగలట్లేదు. కచ్చితంగా సుధీర్ బాబు ఫ్యూచర్ లో స్టార్ గా ఎదగగలడు అని ఫిక్స్ అవ్వొచ్చు. పిక్స్ చూసిన మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా సుధీర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి సుధీర్ ఈ యాక్షన్ మోడ్ ఏ సినిమా కోసం అన్నది తెలియాల్సి ఉంది.  సుధీర్ బాబు హిట్టు కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.  సుధీర్ బాబు హిట్టు కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అది ఏ సినిమాతో నిజమవుతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: