తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరు సినీ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  భారతీయ చలన చిత్ర రంగంలో అతికొద్ది మంది సూపర్ స్టార్స్ లో రజినీకాంత్ ఒకరు.  తమిళ నాట రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆయన్ని దైవంగా భావించే వారు ఎంతో మంది ఉన్నారు.  ఆరు పదులు దాటినా కుర్ర హీరోలతో పోటీ పడి మరీ సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు.  రజినీకాంత్ మూవీ రిలీజ్ అయ్యిందంటే..హిట్టూ..ఫ్లాప్ అనే తేడా లేకుండా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.  ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’ మూవీలో నటిస్తున్నారు రజినీకాంత్. 

ఈ మూవీలో ‘చంద్రముఖి’ తర్వాత మరోసారి నటిస్తుంది నయనతార. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మద్య రజినీకాంతో రాజకీయాల వైపు కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు.  తాజాగా రజినీకాంత్ కి అరుదైన గౌరవం దక్కింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్స‌వాలు ప్ర‌తి ఏడాది గోవాలో ఘనంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ వేడుక‌లో ప‌లు సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు కొంద‌రు ప్ర‌ముఖుల‌ని అవార్డుల‌తో స‌త్క‌రించ‌నున్నారు. ఈ నేపథ్యంలో 2019 అవార్డ్స్‌లో 'ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ' అవార్డ్‌తో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను స‌త్క‌రించ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార ప్ర‌సారశాఖ  మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేవ‌క‌ర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. అంతే కాదు వివిధ దేశాల‌కు చెందిన 250 సినిమాల‌ను ఈ వేడుక‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అలానే ఈ ఫిలిం ఫెస్టివల్ లో యాభై మంది విమెన్ డైరెక్టర్స్ రూపొందించిన  యాభై సినిమాలను స్క్రీన్ చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: