సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో తన దృష్టిని పాలిటిక్స్‌పైనే  కేంద్రీకరించాడు. అంతేకాదు తను సినిమాలు  చేస్తున్నట్టు వస్తున్న ప్రచారాలను సైతం ఖండించాడు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. తన దృష్టిని మరల సినిమాలపై కేంద్రకరించినట్టు సమాచారం.


ఇది వరకటిలా మాస్ సినిమాలు కాకుండా.. జనాలను చైతన్య పరిచే సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక ఏపీలో ఎలక్షన్స్‌కు మరో ఐదేళ్లు ఉండటంతో రాజకీయల్లో కొనసాగుతూనే.. ఈ లోగా ప్రజలను మేలుకొలుపే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు సమాచారం.


తాజాగా పవన్ కళ్యాణ్.. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్‌ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు. ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.వీటితో పాటు ప్రముఖ దర్శకుడు.. క్రిష్ దర్శకత్వంలో తన ఓన్ దర్శకత్వంలో ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’ సినిమాను చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.


ఇప్పటికే క్రిష్..‘సత్యాగ్రాహి’   సినిమాను ‘పింక్’ సినిమాతో పాటు ఒకేసారి షూటింగ్ చేయనున్నట్టు సమాచారం. క్రిష్ విషయానికొస్తే.. కెరీర్ మొదటి నుంచి ‘గమ్యం’, ‘కంచె’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ఎన్టీఆర్ బయోపిక్ వంటి డిఫరెంట్ సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులో కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఫెయిలైనా.. దర్శకుడిగా క్రిష్ మాత్రం ఫెయిల్ కాలేదు. త్వరలోనే పవన్ కళ్యాణ్.. క్రిష్‌తో చేయబోయే సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: