సూపర్ స్టార్ అంటే ఒక్కరే ఉంటారు. ఆయనే రజనీకాంత్. తమిళనాట ఆయన ఆరాధ్య దైవం. ఇక దక్షిణ భారతమే కాదు, ఉత్తర భారతాన్ని వూపేసిన టాప్ క్రేజ్ ఆయన సొంతం. నిజానికి పాన్ ఇండియా మూవీకి కేరాఫ్ అడ్రస్ గా రజనీ నిలిచారు. ఆయన 2011లో తీసిన రోబో మూవీ తరువాతనే సౌత్ మూవీస్ స్పాన్ పెరిగింది. దాంతో రాజమౌళి లాంటి వారికి కొత్త ఆలోచనలు వచ్చాయి. అలా బాహుబలికి స్పూర్తి ఈ తమిళ బాహుబలి అని చెప్పాలి.


ఇదిలా ఉండగా  ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డ్‌ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు నాలుగున్న దశాబ్దాలుగా భారతీయ చలన చిత్ర సీమకు ఆయన చేస్తున్న  సేవలకు గానూ ఈ అవార్డ్ ని ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ వెల్లడించారు. రజనీకాంత్ కి ఈ అవార్డ్ ఇవ్వడం ఓ గౌరవంగా భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.


గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో నిర్వహించనున్నారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 వేడుక 50వది కావటంతో భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ వేదిక మీద రజనీకాంత్ కి ఈ అవార్డ్ ని ప్రదానం చేస్తారు. అదే విధంగా ఫ్రెంచ్‌ నటి ఇసాబెల్లె హుప్పెర్ట్‌కు ఫారిన్‌ ఆర్టిస్ట్‌ విభాగంలో లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్‌ను అందిస్తున్నారు. గోవాలో జరగనున్న ఈ వేడుకలో 50 మంది మహిళ దర్శకులు తెరకెక్కించిన 50 చిత్రాలను ప్రదర్శిస్తున్నట్టుగా జవదేకర్‌ ప్రకటించారు.


కాగా తనకు ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ని ప్రకటించడం పట్ల రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ మురుగదాస్ డైరెక్షన్లో దర్బార్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది పోలీస్ పాత్ర, హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఇక రజనీకాంట్ మరో చిత్రం కూడా కధా చర్చల్లో ఉంది. ఇంకోవైపు  రాజకీయాల వైపు కూడా ఈ సూపర్ స్టార్ వేగంగా అడుగులు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: