సినీ పరిశ్రమలో స్టార్ హీరోలతో  పోలీస్ నేపథ్యంలో వచ్చిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయ్యాయి.  బాలీవుడ్ లో ఫ్లాపులతో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్ కి ‘దబాంగ్’ సినిమా సూపర్ సక్సెస్ ఇచ్చింది.  వెంటనే ఈ మూవీ సీక్వెల్స్ చేసే పనిలో ఉన్నారు సల్మాన్ ఖాన్.  ప్రస్తుతం ప్రభుదేవ దర్శకత్వంలో దబాంగ్ 3 కూడా వస్తుంది.  టాలీవుడ్ లో అప్పటి వరకు ఫ్లాప్ టాక్ తో ఇబ్బందులు పడుతున్న పవన్ కళ్యాన్ కి హరీష్ శంకర్ దర్శకత్వంలో పోలీస్ నేపథ్యంలో వచ్చిన దబాంగ్ రిమేక్ మూవీ ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

మాస్ మహరాజ కెరీర్ బిగినింగ్ లో రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.  ఇలా స్టార్ హీరోలు పోలీసులుగా నటించి ప్రేక్షకుల మనసు దోచిన విషయం తెలిసిందే.  అయితే ఇది కొంత మంది హీరోలకు పెద్దగా వర్క్ ఔట్ కాదు.  ఆ మద్య రవితేజ పోలీస్ నేపథ్యంలో వచ్చిన టచ్ చేసి చూడు పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.  తాజాగా మరోసారి విక్రమార్కుడు లెవెల్లో పోలీస్ నేపథ్యంలో ఉన్న మూవీలోకి రెడీ అవుతున్నారు రవితేజ.  గతంలో తనకు డాన్ శీను, బలుపు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు  గోపీచంద్ మలినేనితో రవితేజ్ ఓ మూవీలో నటించబోతున్నాడు.   త్వరలో ఆయన 'డిస్కోరాజా' ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనుల్లో వున్నాడు.

మూవీ తర్వాత గోపిచంద్ మలినేనితో  పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్న ఈ సినిమా, పూర్తి యాక్షన్ మూవీగా సాగుతుందని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే, 'విక్రమార్కుడు' సినిమాలో మాదిరిగా ప్రతినాయకుడు ఎంతటివాడైనా కొమ్ములు వంచే ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు.  ఈ సినిమాలో రవితేజ జోడీగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో అయినా మాస్ మహరాజా పుంజుకుంటాడా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: