కోలీవుడ్ నటుడు శివకుమార్ చిన్న తనయుడు మరియు తమిళ సూపర్ స్టార్ సూర్య కు తమ్ముడైన కార్తీ, తొలిసారిగా యుగానికి ఒక్కడు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే తొలి చిత్రమే ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇక ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఆవారా సినిమాతో సూపర్ డూపర్ కొట్టిన కార్తీ, అనంతరం నటించిన నా పేరు శివ మరియు ఊపిరి సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే గతకొద్ది రోజులుగా మాత్రం సరైన సక్సెస్ లేని కార్తీ, ఇటీవల యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించిన ఖైదీ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. 

వాస్తవిక ఘటనలతో సహజత్వానికి దగ్గరగా ఎంతో ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమాలో కార్తీ ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటించడం జరిగింది. పదేళ్ల తరువాత జైలు నుండి విడుదలైన ఒక ఖైదీ, తన కూతురిని కలుసుకునేందుకు మధ్యలో ఎటువంటి సమస్యలు ఎదుర్కున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు ప్రేక్షకుడికి నచ్చేలా తెరకెక్కించి మంచి మార్కులు సంపాదించాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా తొలిరోజు తొలిఆట నుండి సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు. 

ఇక నిన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం జరిగింది. అలరించే స్క్రీన్ ప్లే, అద్భుతమైన యాక్షన్ మరియు ఫైటింగ్ సీన్స్, మంచి విజువల్స్, అలరించే నటుల పెర్ఫార్మన్స్ వెరసి ఖైదీ సినిమాకు సూపర్ హిట్ టాక్ ని తెచ్చిపెట్టాయి. ఇకపోతే నేటితో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్ల మార్కును దాటుకుని మంచి లాభాల బాటలో పయనిస్తోందని సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఇటు తెలుగులో కూడా దుమ్ముదులుపుతూ ముందుకు సాగుతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెంత మేర కొల్లగొడుతుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: