బన్నీ, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అల వైకుంఠపురములో. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా సామజవరగమన, రాములో రాములో పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ రెండు పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవటంతో ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. రాములో రాములో పాట కోసం ఈ సినిమా నిర్మాతలు ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. 
 
రాములో రాములో పాట కోసం పెట్టిన ఖర్చుతో రెండు చిన్న సినిమాలు మంచి క్వాలిటీతో తీయవచ్చు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలోని పాటల కొరకు కోటి రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారు. కానీ రాములో రాములో పాట విజువల్ ట్రీట్ లా ప్రేక్షకులకు ఉండాలనే ఆలోచనతో భారీ మొత్తంలో ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ పాట్ సెట్ కే రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయిందని తెలుస్తోంది. 
 
ముంబాయి మేకప్ మెన్, ముంబాయి డ్యాన్సర్లను రప్పించటంతో భారీగా ఖర్చయిందని తెలుస్తోంది. కానీ పాట బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో ఖర్చుకు తగిన పబ్లిసిటీ వచ్చినట్లే అని చెప్పవచ్చు. అల వైకుంఠపురములో సినిమాలోని మిగతా పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. సుశాంత్, నివేతా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 
 
కాసర్ల శ్యామ్ ఈ పాటను రాయగా శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించాడు. 2020 సంవత్సరం జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఇదే రోజు విడుదల కాబోతూ ఉండటం గమనార్హం. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కాబోతూ ఉండటంతో ప్రేక్షకుల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందనే ఆసక్తి నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: