చాలా మంది తమ అందాలతో కవ్వించడం.. యూత్ ని టెంప్ట్ చేయడం.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం.. ఇదే ఇప్పుడు ట్రెండ్. బాలీవుడ్ లో కుప్పలకొద్ది నటవారసులు బరిలో దిగుతుంటే వీళ్ల మధ్య పోటీ కూడా అదే రేంజులో ఉంటుంది మరి. స్టార్ ల కూతుళ్ళు డెబ్యూ నాయికలుగా రాణించేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఎంత స్టార్ కూతుళ్ళైతే  మాత్రం హీరోయిన్ సక్సస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. మొహానికి మేకప్ వేకుకోకముందు నుంచే విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవాలి.

ఫాలోవర్స్ పెరగాలంటే అందుకు ఎలాంటి ట్రిక్స్ వాడాలో ఈ బ్యూటీస్ కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఏదైనా ఫంక్షన్, పార్టీలు, పబ్బులు.. ఆఖరికి జిమ్ కి వెళ్ళాలన్న ఎటువంటి మేకప్ తో గ్లామరస్ గా కనిపిస్తే యూత్ ఫాలో అవుతారో అలానే హాట్ హాట్ గా రెడీ అయి వెళుతున్నారు. చిట్టి పొట్టి నిక్కర్లతో .. కురచగా ఉండే ఫ్రాకుల్లో.. టైట్ స్పోర్ట్స్
డ్రెస్సులతో వీధుల వెంట గ్లామర్ ట్రీటిస్తుంటే జనం ఊరేగింపుగా వచ్చి మీద పడేంతగా ఫాలోయింగ్ వచ్చేస్తోంది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో దాదాపు ఓ 10 వరకు క్యూట్ బ్యూటీస్ లక్ చెక్ చేసుకుంటున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. సైఫ్ ఖాన్ కూతురు సారా అలీఖాన్ ఇప్పటికే తమ లక్ ని చెక్ చేసుకున్నారు. కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. ఈ బ్యూటీస్ ఇద్దరు 24/7 యూత్ అట్రాక్షన్ మొత్తం తమవైపే ఉండేలా స్కిన్ షో తో ఆకట్టుకుంటున్నారు. ఇక కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో పరిచయం చేసిన చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే, తారా సుతారియా కూడా పొట్టి నిక్కర్లు .. కురచ ఫ్రాకుల్లో ఎప్పుడు ఎక్కడో ఒకచోట హల్‌చల్ చేస్తున్నారు.

ఇక వీళ్లందరితో పోటీపడేందుకు దూసుకొస్తున్న మిగతా బాలీవుడ్ స్టార్ల క్యూటీస్ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారూక్ నటవారసురాలు సుహానా ఖాన్ ఇటీవల సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. హీరోయిన్ అవ్వాలన్న కోరికతో ఈ బ్యూటి ఇప్పటికే నట శిక్షణ తీసుకుని రెడీగా ఉంది. త్వరలోనే డెబ్యూ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. ఈలోపే యూత్ ని టెంప్ట్ చేయడానికి సుహానా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తన గ్యాంగ్ తో సుహానా సోషల్ మీడియాలోలో 24/7 చిట్టి పొట్టి నిక్కర్లతో సందడి చేస్తూ రకరకాల వీడియోలతో హీటెక్కిస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: