సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105..రూలర్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో యంగ్ లుక్ కోసం ఎంతో ట్రై చేస్తున్నారు. బాలయ్య యంగ్ లుక్ మెస్మరైజ్ చేసేస్తుందని.. ఈసారి నందమూరి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీటివ్వబోతున్నారని బాగా టాక్ నడుస్తోంది. అదే కాదు.. 65 కేజీలకు తగ్గేందుకు బాలయ్య తీవ్రంగా శ్రమిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే 105 కేజీల నుంచి 25 కేజీలు తగ్గి 80 కేజీలకు వచ్చారు బాలయ్య. ఇక 65 వెయిట్ తో యంగ్ లుక్ కి మారిపోవాలనుకుంటున్నారట. అయితే బాలయ్య ఇంతగా కష్టపడేది బోయపాటి సినిమా కోసమని సమాచారం. ప్రస్తుతం రూలర్ లో నటిస్తున్న బాలయ్య ఆ తర్వాత బోయపాటి సినిమా కోసం ఇప్పటి నుంచే కొత్త మేకోవర్ ని ట్రై చేస్తున్నరని తెలుస్తోంది. 

అయితే రూలర్ నుంచి ఇప్పటికే రెండు స్టిల్స్ వచ్చాయి. ఇవేవీ బాలకృష్ణ ఫ్యాన్సుకి నచ్చకపోవడంతో కూడా ఆసక్తికరమైన చర్చ సాగింది. వాటిలో అసలు యంగ్ లుక్ ఏదీ అంటూ కామెంట్స్ విసిరారు. ఆ రెండు లుక్స్ అంత బాలేదన్న నెగిటివ్ టాక్ వచ్చింది.  దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోలీస్ గెటప్ లుక్ కానీ.. యాక్షన్ మోడ్ లుక్ కానీ అస్సలు బాలేదని బాలయ్య ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఆ ఫోటోల్లో బాలయ్య ఏజ్ కూడా కనబడి పోవడంతో ఫ్యాన్స్ హర్టయ్యారు.

అయితే కొద్దిరోజుల్లో వేరే గెటప్స్ ని రివీల్ చేయబోతున్నారట. ఈసారి బాలయ్య లుక్స్.. సూపర్..డూపర్ అని అయితే అంటున్నారు కానీ రిలీజైతేగానీ తెలీదు ఎంత సూపరో. అయితే ఇప్పుడు రాబోతున్న స్టిల్స్ అయినా ఫ్యాన్స్ కి నచ్చుతాయా? లేదా అంటూ లోలోపల అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి జై సింహ తో బాలయ్యని డిఫ్రెంట్‌గా ప్రజెంట్ చేసిన కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే లుక్స్ పరంగా సరే మరి వాయిస్ లో వణుకు ఎలా తగ్గిస్తారని కొందరు కామెంట్స్ చేస్తున్నారట. ఎందుకంటే పైసా వసూల్ సినిమాలో బాలయ్య డైలాగ్స్ అన్నీ కాస్త వాయిస్ లో ఏజ్ కనపడేలా చేశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: