ప్రస్తుతం సినీ పరిశ్రమలో వినపడే మాటలు కాస్టింగ్ కౌచ్.. మీటూ అనేవి. సినీ ఇండస్ట్రీలో కి రావడానికి చాలా మంది భయపడుతున్నారు. ఉన్నవాళ్లు కామాంధుల భారీన పడకుండా జాగ్రత్త పడుతున్నారు.. యాక్టింగ్ పరంగానే కాకుండా నిత్యం పోరాడుతూ వస్తున్నారు. మానన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. 


ఇటు సింగర్స్ కూడా ఈ భాదలను ఎదుర్కుంటున్నారు.. అసలు విషయానికొస్తే..ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ అను మాలిక్‌ గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇటీవల గాయని సోనా మొహాపాత్ర అతనిపై మీటూ ఆరోపణలు చేసింది.. ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఇప్పుడు మరో సింగర్ అతని పై దుమ్మెత్తి పోస్తున్నారు.


21 ఏళ్ల వయసులో నేను అను మాలిక్ స్టూడియో‌కి వెళ్లాను. నేను పాడిన పాటల సీడీ ఆయనకు చూపిస్తే నచ్చి నాకు ఛాన్స్ ఇస్తాడనుకున్నా. కానీ ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఆ సమయంలో అతను సోఫాలో కూర్చుని నా కళ్లను పొగుడుతూ సెక్స్ కోరికలతో మాట్లాడాడు..నాకు ఆ విషయం అర్థమవడంతో నేను అక్కడి నుండి తప్పిం చు కొని వచ్చేసాను. ఆ తర్వాత ఆయనకు కనపడలేదు అంటూ ఓ ప్రముఖ సింగర్ కామెంట్లు చేసింది.


1999 నుండి 2000 వయసు ఉన్నప్పుడు నేను పదహెను ఏళ్ళ అమ్మాయిని అలాంటిది నన్ను చిన్న పిల్ల ఎవరికి చెబుతుంది అన్నట్లుగా అసభ్యకరంగా ప్రవర్తించాడు.. దానితో నేను భయపడ్డాను. అని ఆమె వెల్లడించింది. ఇకపోతే నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. అప్పుడు చెంప పగలగొట్ట కుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం అను మాలిక్ హాట్ న్యూస్ అయ్యాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: