ఇటీవల  ఏ సినిమా  కు రానంత  పాజిటివ్  టాక్ తమిళ హీరో  కార్తి నటించిన  లేటెస్ట్  మూవీ ఖైదీ కి వచ్చింది.   టాక్ బాగుంటే  బాక్సాఫీస్ వద్ద  ఏ రేంజ్ లో వసూళ్లను  రాబట్టొచ్చో ఈసినిమా  నిరూపిస్తుంది.  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం  30లక్షల షేర్ ను మాత్రమే రాబట్టిన ఈచిత్రం  సరిగ్గా వారం తిరిగే సరికి 5.5కోట్ల  గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  ఈమధ్య కాలంలో   తెలుగు ప్రేక్షకులను  మెప్పించిన  తమిళ  సినిమా   ఖైదీ తప్ప మరోటి లేదనడం లో ఏమాత్రం  అతిశయోక్తి లేదు. నిజానికి  సినిమా విడుదలకు  ముందు వరకు పెద్ద గా హైప్ రాలేదు. 



కార్తి నటించిన  చినబాబు , దేవ్ సినిమాలు డిజాస్టర్లు అయ్యి  అతని గ్రాఫ్ ను తగ్గించాయి.  దాంతో  కేవలం 4కోట్ల కే ఖైదీ ని కొని తెలుగు రాష్ట్రాల్లో  విడుదల చేశాడు  కేకే రాధామోహన్.  ఫలితంగా ఈ చిత్రం ఇప్పుడు బయ్యర్లను లాభాల్లో ముంచెత్తుతుంది.  ఇక మొదటి వారాంతం విజిల్ హావ నడిచినా  సోమవారం నుండి ఖైదీ  బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో కొనసాగుతుంది.  నిన్న విడుదలైన చిత్రాలు కూడా  ఈ సినిమా కు ఏ మాత్రం  పోటీనివ్వలేక పోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రం డ్రీం రన్  ను కొనసాగిస్తోంది. 



ఇప్పట్లో తెలుగులో పెద్ద సినిమాల విడుదలలేనందున ఫుల్ రన్ లో ఈ చిత్రం  8కోట్ల  వరకు  రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.  లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డ్రీం వారియర్స్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించగా సామ్ సీఎస్  సంగీతం అందించాడు. హీరోయిన్ మరియు సాంగ్స్ లేకుండా  ఈ చిత్రం తెరకెక్కడం  విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: