టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సైరా నరసిమహారెడ్డి సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ ఒక స్వతంత్ర సమరయోదుడిగా నటించిన ఈ సినిమాను ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న గాంధీ మహాత్ముని జయతి సందర్భంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం ఓవర్ అల్ గా యావరేజ్ గా నిలిచింది. సినిమాలో మెగాస్టార్ నటన, సెట్స్, విజువల్స్ మాత్రమే బాగున్నాయని, అయితే కథ, మరియు కథనాలు మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేవని మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. 

ఇకపోతే దీని తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవల జరుగగా, ఆ సినిమాలో నటించబోయే హీరోయిన్ మరియు సంగీత దర్శకుడి విషయమై కొద్దిరోజలుగా మీడియా మాధ్యమాల్లో పలు వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. వాటి ప్రకారం, తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీప్రసాద్ ను ఈ సినిమాకు కొరటాల తీసుకునే అవకాశం చాలావరకు లేదట. దానికి కారణం ఆయనకు డేట్స్ ఖాళీగా లేకపోవడమే అంటున్నారు. కావున ఆయన స్థానంలో వేరొక సంగీత దర్శకుడిని తీసుకునే అవకాశం కనపడుతోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార మరియు త్రిషల పేర్లు ఇటీవల ప్రచారం అయ్యాయి. 

అంతేకాక నిన్నటి నుండి ఈ సినిమాలో మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న వార్తల ప్రకారం, వీరెవరూ కూడా మెగాస్టార్ సరసన హీరోయిన్స్ గా సెలెక్ట్ కాలేదని ఆ సినిమా యూనిట్ తేల్చేసిందట. అంతేకాక తమ సినిమాలోని నటీనటుల, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో అధికారికంగా తెలియపరుస్తామని సినిమా యూనిట్ చెప్తోందట. దీనితో ప్రస్తుతం ఈ సినిమా విషయమై ప్రచారం అవుతున్న వార్తలకు కొంతవరకు చెక్ పడ్డట్లైంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: