మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వెరైటీ కథల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా గత ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో మంత్ర ముగ్ధులు అయ్యారనే చెప్పాలి. ఆయనతో పాటు హీరోయిన్ సమంత, హీరో అన్న పాత్రలో నటించిన ఆది పినిశెట్టి, విలన్ గా నటించిన జగపతి బాబు మరియు ప్రకాష్ రాజ్ సహా మిగతా నటీనటులు అందరూ కూడా తమ ఆకట్టుకునే నటనతో రంగస్థలం సినిమాని ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలిచారు. 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేసారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా ఈ సినిమా తమిళ హక్కుల విషయమై విపరీతమైన పోటీ నెలకొనడంతో ఎవరు ఈ సినిమా హక్కులు దక్కించుకుంటారు అనే దానిపై ఎంతో ఉత్కంఠత నెలకొంది. ఇక చివరకు నేడు ఈ సినిమా హక్కులను ఒక ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ అత్యంత భారీ ధరకు దక్కించుకోవడం, అలానే ఆ సినిమాలో హీరోగా నటుడు, నృత్యదర్శకుడు మరియు దర్శకుడైన రాఘవ లారెన్స్ ని ఎంపిక చేయడం జరిగిందట. 

అంతేకాక ఈ సినిమాకు మాస్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోందట. అలానే మరికొద్దిరోజుల్లో ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు కూడా జరుగనున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగులో రామ్ చరణ్ అదరగొట్టిన చిట్టిబాబు క్యారెక్టర్ ని తమిళ్ లో లారెన్స్ ఎంతవరకు ఆకట్టుకునేలా పోషిస్తారో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: