అక్కినేని కోడలు నాగ శౌర్య తనకు నచ్చిన ఎలాంటి విషయం గురించి అయినా సరే సోషల్ బ్లాగ్ లో పెడుతుంది. ఈ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తుందని తెలిసిందే. అయితే సినిమాలతోనే కాదు తోటి నటీనటుల మీద కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది సమంత.


లేటెస్ట్ గా నాగ శౌర్య జిం వర్క్ అవుట్ పిక్ పై సమంత క్రేజీ కామెంట్ అక్కినేని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ముందు చెప్పినట్టుగా తనకు నచ్చిన పనిని చేయడంలో అసలు వెనుకడుగుగ్ వేయని సమంత నాగ శౌర్య ఇన్ స్టాగ్రాం పిక్ పై క్రేజీ కామెంట్ పెట్టింది. జిమ్ వర్క్ అవుట్ చేస్తూ కండలు తిరిగిన దేహంతో నాగ శౌర్య తన ఇన్ స్టాగ్రాం లో ఓ పిక్ షేర్ చేశాడు. 


కనీసం దీనికి ట్యాగ్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వకుండా తన తండ్రి ఫోటో పోస్ట్ చేయమన్నాడట. అయితే ఈ పిక్ చూసిన సమంత ఓ మై గాడ్.. వాట్ ఈజ్ దిస్ క్రేజీనెస్ అంటూ కామెంట్ పెట్టింది. సమంత కామెంట్ వల్ల నాగ శౌర్య పిక్ మరింత వైరల్ గా మారింది. ఈ ఇయర్ వచ్చిన ఓ బేబీ సినిమాలో నాగ శౌర్య, సమంత కలిసి నటించారు.  


ప్రస్తుతం నాగ శౌర్య అశ్వద్ధామ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆ సినిమా రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. నాగ శౌర్య పిక్ కు సమంత కామెంట్ పెట్టడం వల్ల అతని సినిమాల మీద ప్రేక్షకులు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: