టైటిల్ చూసి కాస్త కంగారుపడే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ నాని ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉన్న హీరోలు ఎవరి స్టామినా వారిది నాని తీసే సినిమాలకు విజయ్ దేవరకొండ తీసే సినిమాలకు అసలు సంబంధం ఉండదు అయినా సరే నానిని ఫాలో అవుతుంటాడు రౌడీ స్టార్. అదెలా అంతే హీరోగా నిలదొక్కుకున్న నాని నిర్మతగా మారి తన టేస్ట్ ఏంటో చూపిస్తున్నాడు. 

 

మొదటి సినిమా అ! తో అందరిని ఆశ్చర్యపరచిన నాని నిర్మాతగా కూడా తన స్పెషాలిటి చాటుకున్నాడు. ఇక నాని తన సెకండ్ ప్రాజెక్ట్ హిట్ అని ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. చిలసౌతో మెప్పించిన రుహాని శర్మ హీరోయిన్ గా చేస్తుంది. 

 

హీరోగా మంచి ఫామ్ లో ఉన్న నాని నిర్మాతగా మారినట్టుగా విజయ్ దేవరకొండ కూడా నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తా సినిమా తీశాడు. ఈ సినిమా చుసిన ఆడియన్స్ విజయ్ ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా తీశాడని డౌట్ పడుతున్నారు. షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగానే ఉంది మీకు మాత్రమే చెప్తా సినిమా క్వాలిటీ. 

 

అన్ని విషయాల్లో నానిని ఫాలో అయ్యే విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా ఎందుకు కంప్రమైస్ అయ్యాడో తెలియాల్సి ఉంది. నాని అ! సినిమాలో స్టార్ కాస్ట్ కూడా చాలా పెద్దది అయినా సరే క్వాలిటీ విషయంలో రాజి పడలేదు మరి విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా విషయంలో ప్రొడక్షన్ పరంగా మిస్టేక్ చేసినట్టే అనిపిస్తుంది. మొదటి సినిమా అనుభవ లోపం అనుకుని సరిపెట్టుకుంటే ఇక మీదట అయినా విజయ్ నిర్మాతగా తన రేంజ్ కు తగిన సినిమాలు తీయాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: