ఈరోజు విశాఖపట్నంలో భవన కార్మీకుల సమస్యలకు సంఘీ భావాన్ని తెలుపుతూ పవన్ నిర్వహిస్తున్న ఇసుక మాఫియా వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ లాంగ్ మార్చ్ లో లక్ష మంది పాల్గొంటారని ‘జనసేన’ వర్గాలు పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఇక్కడ కూడ పవన్ ను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ హడావిడి పెరిగి పోతోంది. సాధారణంగా లాంగ్ మార్చ్ అంటే ఒక 10 కిలో మీటర్లు ఉంటుందని కేవలం విశాఖపట్నంలోని మద్దిలపాలెం నుండి మున్సిపల్ కార్పోరేషన్ వరకు గట్టిగా రెండు కిలోమీటర్లు దూరం లేని ప్రాంతంలో లాంగ్ మార్చ్ అంటే ఎలా అంటూ కొందరు అప్పుడే విమర్శలు మొదలుపెట్టేసారు. 

అంతేకాదు విశాఖపట్నం విమానాశ్రయం నుండి సిటీలోకి ఏ పెద్ద రాజకీయవేత్త వచ్చినా 10 కిలో మీటర్లు జనంతో నిండిపోయిన సందర్భాలను గతంలో ఎన్నో సార్లు విశాఖపట్నం ప్రజలు చూసారని ఇప్పుడు ఈ కాస్త దూరంలో పవన్ ఏమి సంచలనాలు చేయగలదు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు పవన్ ఎంచుకున్న మార్గంలో జనం ఎప్పుడు తిరుగుతూ ఉంటారనీ అందువల్ల ఆ వచ్చిన వారు అంతా పవన్ అభిమానులు అనుకుంటే పొరపాటే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈరోజు జరగబోతున్న లాంగ్ మార్చ్ తరువాత పవన్ చేసే ఉపన్యాసంలో కేవలం జగన్ మాత్రమే టార్గెట్ చేసి బిజెపి ని పక్కకు పెడతాడా లేదంటే ఈ రెండు పార్టీలకు తాను మరింత దూరం అన్న సంకేతాలు ఇస్తాడా అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఎన్నికలలో ఓటమి తరువాత పవన్ జనం మధ్య ఒక మీటింగ్ లో ఉపన్యసించడమే కాకుండా తాను ఓడిన గాజువాక ప్రాంతం దగ్గరలో ఉండే విశాఖపట్నంలో ఈరోజు పవన్ చేసే ‘లాంగ్ మార్చ్’ కి జనం నుండి వచ్చిన స్పందనను బట్టి పవన్ ‘జనసేన’ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: