దాదాపు వంద రోజులు అంటే మూడు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను టీవీలకు కట్టిపడేస్తున్న భారతదేశపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ చిట్ట చివరి దశకు చేరుకుంది. 15 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ లో ప్రయాణం మొదలుపెట్టిన నాగార్జున నేడు విజేత ఎవరో ప్రకటించబోతున్నాడు. ఎన్నో ఆటలు పాటలు, గొడవలు, ప్రేమానుబంధాల మధ్య ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ నేటితో ముగియనుండగా ఆ ఒక్క ట్రోఫీ మరియు 50 లక్షల ప్రైజ్ మనీ కోసం ఐదుగురు బరిలో నిలిచారు. వారే రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ మరియు అలీ రెజా.

ఇకపోతే వీరందరిలో దాదాపు రాహుల్, వరుణ్ మరియు భాస్కర్ పోటీ మధ్యలోనే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. చివరికి అదే నిజమైంది కూడా. అవును! కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చివరి రెండు స్థానాల్లో బాబా భాస్కర్ మరియు అలీ రెజా వరుసగా ఉన్నారట. ఇకపోతే వరుణ్ సందేశ్ మూడో స్థానంలో నిలవగా చివరికి రాహుల్ సిప్లిగంజ్ మరియు శ్రీముఖి మధ్య టైటిల్ కోసం విపరీతమైన పోటీ నెలకొందట. 

ఇక వీరిద్దరిలో టైటిల్ కైవసం చేసుకుంది మాత్రం అద్భుతమైన గాయకుడైన రాహుల్ సిప్లిగంజ్ అని కచ్చితమైన సమాచారం. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్రీముఖిని వెనక్కి నెట్టి చివరికి రాహుల్ ఈ ట్రోఫీ ని కైవసం చేసుకున్నాడు. మనసులో ఏమున్నా ఓపెన్ గా మాట్లాడడం మంచి మనసుతో అందరితో కలివిడిగా మెలగడం రాహుల్ కి టైటిల్ ను తెచ్చిపెట్టాయి అని అంతా అనుకుంటున్నారు. ఇకపోతే శ్రీముఖి అత్యుత్సాహం మరియు రాహుల్ ఎంత దగ్గర అవుదాం అనుకుంటున్నా అతనిని దూరంగా ఉంచడం ఆమె కొంప ముంచాయి అనే చెప్పాలి. మొత్తానికి వరుసగా మూడోసారి కూడా బిగ్ బాస్ టైటిల్ పురుష కంటెస్టెంట్ ని వరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: