మాస్ మహారాజా రవితేజ కొద్దిరోజులుగా వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా తీవ్ర సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమం మార్కెట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు రవితేజ సినిమా వస్తుందంటేనే అటు ట్రేడ్ వర్గాలు, ఇటు సినీజనాలు  పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. వరుస ప్లాపులు ఎదురవుతున్నా రవితేజ మాత్రం కేవలం రెమ్యూనరేషన్ మీద కాన్సన్ ట్రేషన్ చేస్తూ సరైన కథ ఎంచుకోక‌పోవ‌డంతో రవితేజ మార్కెట్ పూర్తిగా ఖల్లాస్ అయింది.


మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా.. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.. రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తుండగా వీఐ ఆనంద్  దర్శకత్వం వహిస్తున్నారు.. కొత్త రకమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరక్క్కుతున్న ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..ఇక ఈ సినిమా రిలీజ్ ముందే కష్టాల్లో పడినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. డిస్కో రాజా కు ముందు నుంచి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఈ బడ్జెట్ ఇప్పుడు 22 కోట్ల వరకు వెళ్లినట్టు తెలుస్తుంది.. ఇప్పటికి షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు.. ఇంకా తీయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. దాదాపుగా ఓ ముప్పై కోట్ల వరకు బడ్జెట్ అయ్యేలా ఉందని టాక్ నడుస్తుంది. రు. 30  కోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రవితేజ సినిమాకు అంత మార్కెట్ జరగడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే డిస్కోరాజా టేబుల్ లాస్‌ బిజినెస్ తోనే రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అసలు అనుకున్న టైంకు డిస్కోరాజా రిలీజ్ అవుతుందా..!అన్న సందేహాలు కూడా ఉన్నాయి..మరి ఈ కష్టాల నుంచి మాస్ మహారాజ్ డిస్కోరాజాను ఎవరు కాపాడుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: