తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ అంటే మొదట గుర్తొచ్చే పేరు ఎస్వీ రంగారావు. ఆయన తర్వాత జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, కైకాల సత్యనారాయణ, రావుగోపాల రావు, గుమ్మడి, పీఎల్ నారాయణ.. ఇలా మహామహులెందరో గుర్తొస్తారు. తర్వాత ప్రకాశ్ రాజ్, నాజర్ తెలుగు తెరను ఏలేశారు. ఇప్పుడు రావు రమేశ్, నరేశ్ తమ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వీరు సినిమాల్లో లేకపోతే ఏదో వెలితిగా కూడా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు తెరపై మరో క్యారెక్టర్ ఆర్టిస్టు రంగప్రవేశం జరిగింది.

 


తమిళం నుంచి వస్తున్న ఆ నటుడే విజయ్ సేతుపతి. ఇటివల సైరాలో తెలుగులో అరంగేట్రం చేసిన ఆయన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. చాలా సింపుల్ ఎక్స్ ప్రెషన్స్, సహజమైన నటన విజయ్ సొంతం. సైరాతో ఇప్పుడు తెలుగులో అతడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెనలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ – సుకుమార్ సినిమాలో మెయిన్ విలన్ గా తీసుకున్నారని సమాచారం. తమిళంలో హీరోలతో సమానమైన క్రేజ్ విజయ్ సొంతం. విక్రమ్ వేదాతో స్టార్ గా మారిన విజయ్ గతేడాది త్రిషతో నటించిన 96 మూవీ సూపర్ హిట్. క్యారెక్టర్ పాత్రలతో పాటు విలనిజంలో కూడా తమ మార్కు చూపిస్తున్నాడు విజయ్ సేతుపతి.

 


ప్రస్తుతం తెలుగులో ప్రకాశ్ రాజ్ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కు లేట్ గా వస్తున్నాడని, ఇబ్బందులు పడుతున్నారని టాక్ ఉంది. దీంతో విజయ్ సేతుపతికి తెలుగులో మార్కెట్ పెరగుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం తెలుగులో విజయ్ సేతుపతి చేస్తున్న సినిమాలు క్లిక్ అయితే ఇక తెలుగులో కూడా చక్రం తిప్పడం ఖాయమే అని చెప్పాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: