ఆ మధ్య కాలంలో టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో ప్రారంభమైన సిక్స్ ప్యాక్ నిదానంగా అందరూ హీరో లు దాని అనుసరించారు. అందులో కొంతమంది విజయం సాధించారు కొంతమంది సాధించలేదు అది వేరే విషయం అనుకోండి... కానీ ఇప్పుడు ప్రతి హీరో తన ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం నానా కాస్టులు పడి  సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటున్నారు. జిమ్‌లో గంటల కొద్ది గడుపుతూ, ట్రైనర్ చెప్పిన డైట్ ఫాలో అవుతూ సరికొత్త లుక్ లోకి మారుతున్నారు హీరోలందరు.


తాజాగా ఈ లిస్ట్ లోకి కుర్ర హీరో నాగ శౌర్య కూడా కండలు పెంచి షాకింగ్ లుక్ లోకి మారాడు. ప్రస్తుతం ఆయన లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. నాగ శౌర్య ప్రస్తుతం లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ - 8 గా వస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం తెలుస్తుంది. 


సినిమా కోసం భారీగా కండలు పెంచినట్టు ఇట్లాగే తెలిసిపోతుంది. మరోవైపు నాగశౌర్య ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో 'అశ్వద్ధామ' అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణంత కార్యక్రమాలు చేపడుతోంది . నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.


ఇవన్నీ ఇలా ఉంటే ఈ హీరో తన ఇన్స్టాగ్రామ్ లో తన కండలు తిరిగిన బాడీ ని ఫొటో తీసి ఉంచాడు. దీనికి అనేక కామెంట్స్ తో తన అభిమానులు చేస్తునారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే అక్కినేని సమంత కూడా కామెంట్ చేయం ఒకటి. యూ క్రేజీ అని ఒక స్మిలింగ్ ఎమోజి కలిపి పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: