దర్శకుడు వివి వినాయక్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాప్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ గత కొంత కాలంగా హిట్లు లేక రేసులో వెనక బడ్డాడు. అయితే ఆయన ప్రస్తుతం
దర్శకత్వాన్ని పక్కన పెట్టి హీరోగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే "సీనయ్య" అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వినాయక్ లుక్ ఎలా ఉంటుందో ఆల్రెడీ రివీల్ చేశారు. వినాయక్ ఈ సినిమాలో ఒక మెకానిక్ గా కనిపించనున్నాడట.


ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన నరసింహారావు దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. నరసింహారావు గతంలో "శరభ" అనే సినిమాని చేసాడు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాత రాజు గారికి దిల్ రాజు అనే పేరు వచ్చింది. సీనయ్య సినిమాతో నిర్మాత దిల్ రాజు ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాడట.


అయితే హీరోగా వినాయక్ నటిస్తుంటే విలన్ ఎవరనే ప్రశ్న మొదలైంది. విలన్ గా స్ట్రాంగ్ పర్సన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో యంగ్ హీరో అయిన నవీన్ చంద్రని రంగంలోకి దించుతున్నారట. అందాల రాక్షసి ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర..కొన్ని సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. ఆయన నటించిన "అరవింద సమేత" లో ని పాత్ర బాగా పేరు తీసుకొచ్చింది.


అరవింద సమేత నెగెటివ్ షేడ్స్ లో బాగా నటించడంతో సీనయ్య సినిమాలో వినాయక్ కి అపోజిట్ గా నవీన్ చంద్రని తీసుకున్నారట..వీరిద్దరి మధ్య ఎలాంటి పోరాట సన్నివేశాలు ఉండనప్పటికీ మాటల ద్వారా యుద్ధం జరుగుతుందట. అందువల్ల మాటలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని తెలుస్తుంది. మరి నవీన్ చంద్ర విలన్ గా మెప్పిస్తాడా లేదా చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: