స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కెరియర్లో డైరెక్టర్ సుకుమార్ పాత్ర చాలా కీలకమైంది. ఇదే విషయాన్ని చాలాసార్లు అల్లుఅర్జున్ బహిరంగ వేదికలపై చెప్పటం జరిగింది. అంతగా  బన్నీ కెరీర్ లో సుకుమార్ పాత్ర ఇమిడి ఉంది. డైరెక్టర్ సుకుమార్ ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసి బన్నీని సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసి అదిరిపోయే ఇమేజ్ క్రియేట్ చేశాడు. కాగా రంగస్థలం వంటి భారీ హిట్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా సుకుమార్ చేసే ప్రతి సినిమాలో ఒక సెంటిమెంట్ ఉంది.


అదేమిటంటే సుకుమార్ సినిమాల్లో ఉండే హీరోకు ఏదో ఒక లోపం ఉంటుంది ఇదే సమస్య మొట్టమొదట ఆర్య సినిమా లో ఫీల్ మై లవ్ అంటూ ఒక కొంటె కుర్రాడు లా బన్నీ హీరోయిన్ వెంటపడే పాత్రను డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆర్యా2లో అల్లు అర్జున్ ను కొంచెం హైపర్ ఉన్న సైకో యువకుడిలా  మార్చేశాడు. ఇక మహేష్ తో తీసిన 1 నేనొక్కిడినే చిత్రంలో కూడా మహేష్ ను మానసిక సంఘర్షణతో గుర్తుకురాని ఓ హీరోగా మలిచాడు. మొన్నటికి మొన్న ‘రంగస్థలం’లో హీరో రాంచరణ్ ను చెవిటివాడిగా చూపించాడు. ఈ విధంగా డైరెక్టర్ సుకుమార్ తాను స్టార్ట్ చేసే ప్రాజెక్టుల్లో హీరో ఏదో ఒక లోపంతో చూపిస్తూ వచ్చాడు.


ఈ నేపథ్యంలో తాజాగా మూడోసారి సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాలో అల్లు అర్జున్ కి ఏదో ఒక లోపం ఉండేటట్టుగా క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో గంధపు చెక్క స్మగ్లర్ చేసే పాత్రలో బన్నీ నటిస్తున్నట్లు అందుకోసం జుట్టు కూడా బాగా పెంచడానికి రెడీ అవుతున్నట్లు అదిరిపోయే ఫైట్లతో ఈ సినిమా ఉంటున్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: