మరి కొద్ది గంటలలో ‘బిగ్ బాస్ 3’ సీజన్ విజేత ఎవరు అన్న విషయమై క్లారిటీ రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి రాహుల్ విజేత అయ్యాడు అన్న లీకులు నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీముఖి అభిమానులు రాహుల్ పై విరుచుకు పడుతున్నారు.  

తెలుస్తున్న సమాచారం మేరకు ఫైనల్ ఓటింగ్ లో రాహుల్ శ్రీముఖిల మధ్య మార్జిన్ చాల తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో రకరకాల రూమర్లు ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియాను కుదిపెయడమే కాకుండా కొన్ని ప్రముఖ ఛానల్స్ ఈ లీకులను ఆధారంగా చేసుకుని చర్చలు ప్రసారం చేస్తున్నాయి. 

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రగడ పై నాగార్జున కొద్ది సేపటి క్రితం స్పందిస్తూ ఒక ట్విట్ చేసాడు. ‘తెలుగు సీజన్‌ 3 ఒక అద్భుతమైన ప్రయాణమని చెపుతూ బిగ్‌బాస్‌ విన్నర్‌ పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ కార్యక్రమం విజేత ఎవరు అన్నది ఈ సాయంత్రం ప్రసారం అయ్యే ‘బిగ్ బాస్ 3’ చివరిరోజు కార్యక్రమాన్ని చూసి తెలుసుకోమని నాగార్జున కోరుతున్నాడు.

ఇప్పటికే ఈ కార్యక్రమం రికార్డింగ్ పూర్తి కావడంతో ఈ లీకులు వస్తున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీముఖి భిక్ష వల్లే రాహుల్ గెలిచాడని ఆమె టార్గెట్ చేయడం వల్లే రాహుల్‌కు సింపతి పెరిగిందని అందుకే విన్నర్ అయ్యాడని శ్రీముఖి అభిమానులు రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు రాహుల్ పులిహోర బాగా కలిపినందుకు ‘బిగ్ బాస్’ టైటిల్ ఇచ్చారా అంటూ రాహుల్ విజేత అయితే ‘బిగ్ బాస్’ షో పరువుపోయినట్లే అంటూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం  ఎంతో మంది సెలబ్రిటీలు అతిథులుగా రాబోతున్న ఈ కార్యక్రమంలో మెగా సర్ప్రైజ్ కూడా ఉండబోతోంది. నేటితో ఈ షో హంగామా ముగిసి పోవడంతో ఒక విధంగా బుల్లితెర చిన్నబోతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: