టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటున్న హీరో జూనియర్ ఎన్టీయార్. జూనియర్ ఎన్టీయార్ 1991 సంవత్సరంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత బాల రామాణయం సినిమాలో గుణ శేఖర్ దర్శకత్వంలో లీడ్ రోల్ లో నటించాడు. హీరోగా నిన్ను చూడాలని సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన జూనియర్ కు తొలి సినిమా ఫలితం నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ సినిమాకు జూనియర్ 4 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడు. 
 
నిన్ను చూడాలని తరువాత రాజమౌళి జూనియర్ కాంబోలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ అదే సంవత్సరం విడుదలైన సుబ్బు సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఆది సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న జూనియర్ అల్లరిరాముడు సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత వచ్చిన నాగ సినిమా జూనియర్ కెరీర్లో భారీ డిజాస్టర్ గా మిగిలింది. 
 
నాగ తరువాత సింహాద్రితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన జూనియర్ కు ఆంధ్రావాలా సినిమా రూపంలో భారీ షాక్ తగిలింది. సాంబ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకోగా నా అల్లుడు, నరసింహుడు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. అశోక్, రాఖీ సినిమాలు యావరేజ్ ఫలితాన్ని అందుకోగా యమదొంగతో జూనియర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కంత్రి బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకోగా అదుర్స్, బృందావనం సినిమాలు హిట్ అయ్యాయి. 
 
మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన శక్తి డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవటంతో పాటు నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ఊసరవెల్లి బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకోగా దమ్ము డిజాస్టర్ అయింది. జూనియర్ శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన బాద్ షా సినిమాకు హిట్ టాక్ వచ్చినా భారీ బడ్జెట్ తో నిర్మించటంతో కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. రామయ్య వస్తావయ్యా, రభస సినిమాలు కూడా డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. టెంపర్ సినిమా నుండి ఎన్టీయార్ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. జూనియర్ ఎన్టీయార్ కెరీర్లో నిన్నుచూడాలని, సుబ్బు, నాగ, నా అల్లుడు, నరసింహుడు, శక్తి, దమ్ము, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: