టాలీవుడ్‌లో సీనియ‌ర్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ సురేష్‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి సినిమాను అయినా ప‌క్కా ప్లానింగ్‌తో ఫినిష్ చేసి రిలీజ్ చేసి లాభాలు కొల్ల‌గొట్ట‌డం ఆయ‌న స్టైల్‌. ఆయ‌న సినిమాలు తీసినా... డిస్ట్రిబ్యూట్ చేసినా ప్లానింగ్ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. చిన్న సినిమాల‌ను సైతం త‌న బ్యాన‌ర్లో రిలీజ్ చేసి ఆయ‌న లాభాలు సాధిస్తారు. అలాంటి సురేష్‌బాబుకు ఇప్పుడు ఆయ‌న బ్యాన‌ర్లో వ‌స్తోన్న వెంకీమామ పెద్ద త‌ల‌పోటుగా మారింది.


నిజ జీవితంలో మేన‌మామ మేన‌ళ్లుల్లుగా ఉన్న విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మల్టిస్టారర్ వెంకీమామ. జై ల‌వ‌కుశ సినిమా ద‌ర్శ‌కుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా కొంత కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే.  ముందుగా ద‌స‌రాకు అన్నారు. సైరాకు పోటీగా వెళ్ల‌డం ఇష్టంలేక అక్టోబ‌ర్ అన్నారు.... ఇప్పుడు న‌వంబ‌ర్ కూడా వ‌చ్చింది.


క్రిస్మ‌స్‌కు కూడా పోటీ ఎక్కువ‌గానే ఉంది. సంక్రాంతికి భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇప్ప‌టికే ఆ సినిమాల డేట్లు కూడా ఫిక్స్ అయ్యాయి. దీంతో ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. సోలో రిలీజ్ కోసం సురేష్‌బాబు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. డిసెంబ‌ర్ 20 అనుకున్నా అదే రోజు బాల‌య్య రూర‌ల్ లాక్ అయ్యింది. ఇక సోలో రిలీజ్ లాభం లేద‌నుకుని డిసెంబ‌ర్ 12 అనుకుంటున్నార‌ట‌.


డిసెంబ‌ర్ 12న వ‌చ్చినా మ‌రుస‌టి వార‌మే బాల‌య్య రూర‌ల్‌, మెగా హీరో ప్రతిరోజు పండ‌గే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ముందుగా రు.25 కోట్ల బ‌డ్జెట్ అనుకుంటే అది పెరిగి ఏకంగా రు.40 కోట్లు దాటింద‌ట‌. వెంకీ, చైతు మార్కెట్ అంత లేదు. అందుకే రిస్క్ తీసుకోకుండా  సోలో రిలీజ్ అయితే రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇక బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అవ్వ‌డంతో సురేష్‌బాబు బాబిపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఫైర్ అయిన‌ట్టు ఇండ‌స్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌..?



మరింత సమాచారం తెలుసుకోండి: