సామాజిక మాధ్యమాలలో అభిమానులకు చేరువయ్యేలా ప్రయత్నిస్తున్నారు నేటితరం తారలు . ఆధునిక పోకడలతో పోటీపడుతూ తమ ఉనికిని చాటుకుంటున్నారు నాయికలు  ఎవరికి వారు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఇందులో భాగంగా వీడియోలు ఇందులో పోస్ట్ చేసుకుంటూ, ప్రచారాన్ని, అనివార్యంగా ఆదాయాన్ని పొందుతున్నారు.ఇలా చేస్తున్న కొందరు తారలు ఎవరో చూస్తే .


ఈ ఏడాది మార్చిలో తన సొంత యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకుంది బాలీవుడ్ అందాల తార అలియా భట్.  ఈ హాట్ భామ మార్చి నెలలో తన ఖాతాను తెరిచింది జూన్ లోగానే  దాదాపు 4 లక్షల మంది ఖాతాదారులు చేరారు 20 లక్షలకు పైగా మంది ఆమె వీడియోలు చూశారు .అదే విధంగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చేరిన మరో కథానాయిక ప్రియాంక చోప్రా సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టింది ప్రియాంక చానల్కి దాదాపు 5 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు.ఆమె వీడియోస్ కి దాదాపు కోటిన్నర లక్షల వ్యూస్ వచ్చాయి.

మరో ముద్దుగుమ్మ  అయినా శిల్పాశెట్టి కూడా సొంత ఛానల్ నిర్వహిస్తుంది, మూడేళ్ల క్రితం ఏర్పాటుచేసిన యూట్యూబ్ ఛానల్ లో ఆమె శారీరక దృఢత్వం అందుకు ఉపయోగ పడే ఆహార నియమాలు గురించి వివరిస్తుంది. ఈ విషయంలో కాజల్ కూడా ఏమీ తీసిపోదు ఈమె ఖాతాలో దాదాపు మూడున్నర లక్షల మంది అభిమానులు ఉన్నారు, అలాగే ఈమె వీడియోస్ ని దాదాపు 25 లక్షల మంది చూశారు.

అలాగే ఇటీవలే నిన్నటితరం అందాల తార మాధురీ దీక్షిత్ కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకుంది ఈ తరానికి చెరువులను సామాజిక మాధ్యమాలలో భాగస్వామ్యం కావాల్సిందేనని మాధురి చెప్పారు.అలాగే యూట్యూబ్ చానల్స్ లో ఈ ముద్దుగుమ్మలు ఎప్పటికప్పుడు వారి చేసే సినిమాల గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు


మరింత సమాచారం తెలుసుకోండి: