అయితే తెలుగులో మాత్రం
ఖైది సినిమాకు ప్రేక్షకులు ఆమోదముద్ర వేశారు.
థ్రిల్లర్ మూవీగా వచ్చిన
ఖైది సినిమా తెలుగులో మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ
సినిమా చూసిన తెలుగు ఆడియెన్స్ ఇలా కూడా సినిమాలు తీస్తారా అన్న డౌట్ పడుతున్నారు.
లోకేష్ కనగరాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కొన్నాళ్లుగా
కోలీవుడ్ హీరోల సినిమాలు
టాలీవుడ్ లో సరైన ఫలితాలు అందుకోవడం లేదు. రీసెంట్ గా సూర్య బందోబస్త్ కూడా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే
కార్తి మాత్రం మరోసారి బాక్సాఫీస్
విన్నర్ గా నిలిచాడు. మంచి
సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యిందని
కార్తి అన్నారు.
అంతేకాదు
సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ రేంజ్
సక్సెస్ అసలు ఊహించలేదని..
ఖైది సినిమాకు ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావట్లేదని. ప్రతి ఒక్కరూ ఉత్కంఠతతో చూసేలా ఈ
సినిమా తెరకెక్కించాం.. ఆ విషయంలో చిత్రయూనిట్
సక్సెస్ అయిందని అనుకుంటున్నా.. ప్రేక్షకుల నుండి ఈ స్పందన తాము ఊహించలేదని అన్నారు కార్తి.
ఖైది సినిమాతో
కార్తి తెలుగులో తన ఇమేజ్ మళ్లీ కాపాడుకున్నాడని తెలుస్తుంది. రజినికాంత్,
కమల్ హాసన్ కూడా ఈమధ్య తెలుగు బాక్సాఫీస్ పై తన పట్టు సాధించడం లేదు. అలాంటిది
కార్తి వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులో
కార్తి ఖైది సినిమాను కె.కె రాధామోహన్ రిలీజ్ చేశారు.