టాలీవుడ్ సినిమా పరిశ్రమకి అష్టా చమ్మ అనే
సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నటుడు
నాని, అంతకు ముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్
డైరెక్టర్ గా పని చేయడం జరిగింది. అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని, ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగిన
నాని, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నాచురల్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇటీవల
జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో మంచి
సక్సెస్ లు అందుకున్న
నాని, ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి అనే వెరైటీ కథా చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మంచి యాక్షన్
థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో
నాని క్యారెక్టర్ ఎంతో డిఫరెంట్ గా మరియు అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే కొద్ది రోజుల క్రితం, తన సినిమాల విషయమై
నాని ఒక సంచలన విషయం తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు ఒక వార్త విరివిగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, కేవలం
హీరో గానే కాక, తనకు నెగెటివ్ ఛాయలున్న మంచి పాత్రలు కనుక వస్తే అటువంటి పాత్రలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమని ఆయన తెలిపినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న వి సినిమాలో
నాని విలన్ గా నటిస్తున్నారు అనే వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి.
ఇక మరోవైపు త్వరలో తాను హీరోగా నటించబోయే సినిమాకు సంబంధించి పలు కథలు వింటున్న
నాని, అతి త్వరలో తన నెక్స్ట్
సినిమా ని అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఇప్పటివరకు హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న
నాని, ఇకపై నెగటివ్ క్యారెక్టర్లో నటించి ఏ విధంగా ప్రేక్షకుల మెప్పు పొందుతారో చూడాలి. అయితే వార్తపై అధికారికంగా ప్రకటన మాత్రం రావలసి ఉంది.....!!