ఈ మధ్య కాలంలో జూనియర్ ఆర్టిస్ట్‌లు ఏదో ఒక కారణంతో సెలబ్రెటీల పై సంచలన ఆరోపణలతో ఫేమస్ అయిపోవడం కామన్ అయిపోయింది. ఇటీవలె బోయసునీత జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇదే కోవకు చెందిన అమ్మాయిగా చెప్పవచ్చు. తాను గతంలో పవన్‌కళ్యాణ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డానని అందుకు నాకు సినిమాల్లో నటించే అవకాశాలు కల్పించాలంటూ గీతాఆర్ట్స్‌కి సంబంధించిన బన్నీవాసు పై ఆరోపణలు చేయసాగింది. తనకు సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానని అన్నారని ఒకసారి మరోసారి అలాంటిదేమి లేదంటూ... ప్రస్తుతం తనకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటూ దాని పై ప్రముఖ
నిర్మాత బన్నీవాసు ఆరోగ్య రిత్యా వైద్యం కొరకు అయ్యే డబ్బులను ఆయన ఇస్తాఅన్నారని ఇలా రక రకాల ఆరోపణల మధ్య ఈ వివాదం కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఇటీవలె గొలుసులతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద బంధించుకుని అర్దరాత్రి హల్ చల్ చేసిన జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మరోసారి వార్తల్లోకి వచ్చింది.
బన్నీ వాసుపై సంచలన ఆరోపణలు చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సునీత బోయ తనకు పిచ్చి ఉందంటూ మరో వీడియో వదిలింది. అంతేకాదు చిన్నప్పటి నుండి తనకు మానసిక స్థితి సరిగా ఉండేది కాదని.. తన పేరెంట్స్‌ని కూడా కొట్టేదాన్ని అంటూ బన్నీ వాసు తనకు ట్రీట్ మెంట్ ఇప్పించాలని కోరుతోంది సునీత బోయ. ఈ వ్యవహారం మా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గేటు వద్ద మొదలై కోర్టు వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు సునీత విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది.
సునీత ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటూ తనకు వెంటనే మానసిక వైద్యుల చే ట్రీట్మెంట్ జరగాలని కోర్టు వారు ఆదేశించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సునీతకు వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ ట్రీట్మెంట్ విషయంలో సునీత కుటుంబ సభ్యులు కూడా ఇష్టపూర్వకంగానే చేయిస్తున్నారని సమాచారం.
గతంలో బన్నీ వాసు ఆమె మానసిక స్థితి సరిగాలేదని. ఆ అమ్మాయికి
హెల్త్ చూపిస్తా.. సాయం చేస్తా అని అన్నారట. ఒక వీడియో కూడా షేర్ చేశారు. నా
హెల్త్ కండిషన్ బాలేకే ఇలా ప్రవర్తిస్తున్నా అని. నిజంగానే నాకు హెల్త్ బాలేదు. ఈ సమస్య నాకు టెన్త్ నుండే ఉందని. డిప్రెషన్లోకి వెళిపోతుంటుందని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ట్రీట్మెంట్ కొరకు డబ్బులు ఎవరిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.