టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సినీ కెరీర్లో ఎన్నో సినిమాలు  వచ్చినప్పటికీ హలో బ్రదర్ సినిమా కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. సినిమాలో  నాగార్జున డబుల్  రోల్ పోషించారు.ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో  తెరకెక్కిన  హలో బ్రదర్ సినిమా లో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తన కెరియర్ లోనే మొదటి సారి డబుల్ రోల్ లో  నటించారు. అంతేకాకుండా డబుల్ రోల్లో నటించిన నాగార్జున నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కూడా బంపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇక అప్పటి నుంచి నాగార్జున ఇప్పటివరకు మరోసారి డ్యూయల్ రోల్ లో నటించలేదు. ఇక ఆ తర్వాత ఎన్నో విజయాలను సొంతం చేసుకుని అంచలంచలుగా ఎదిగి టాలీవుడ్ మన్మథుడు గా పేరుతెచ్చుకున్నాడు నాగార్జున. అయితే ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

 

 

 

 గత వంద రోజుల నుండి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో లో  నేడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయింది. కాగా  ఫైనల్ ఫై కి చేరుకున్న సభ్యుల్లో  ఇప్పటికే అలీ రాజా ఎలిమినేట్ అయ్యారు. కాగా ఈ సందర్భంగా బిగ్ బాస్  మొత్తం ఫుల్ సందడి గా మారిపోయింది. ఈ సందర్భంగా నాగార్జున ఒక ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. తన కెరియర్లోనే ప్రత్యేక సినిమా అయినా  హలో బ్రదర్ సినిమాలో తనకు డూప్ గా నటించిన హీరో ఎవరో తెలిపారు  నాగార్జున. హలో బ్రదర్ సినిమా లో తన డూప్ గా హీరో శ్రీకాంత్  రెండు సినిమాలలో కనిపించారని  నాగార్జున వెల్లడించారు. 

 

 

 

 కాగా  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ టైటిల్ ఎవరు దక్కించుకుంటారు  అనేది నేడు తేలిపోనుంది. కాగా  16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ షో నేటితో ముగియనుంది. అయితే నేడు  టాలీవుడ్ హీరోయిన్లు కూడా బిగ్ బాస్  స్టేజి మీద సందడి చేస్తున్నారు. కాగా  ఇంకొద్దిసేపట్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో  అని నాగార్జున ప్రకటించనున్నారు. బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియాలంటే ఇంకొద్ది సమయం  ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: